AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kotamreddy: కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో కొత్త ట్విస్ట్.. తెరమీదికొచ్చిన ఎమ్మెల్యే మిత్రుడు

అది ట్యాపింగ్‌ కాదు ఆడియో అంటూ మీడియా ముందుకొచ్చారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి. కోటంరెడ్డి వినిపించిన ఆడియోలో అవతల వైపు ఉన్న వ్యక్తే ఈ రామశివారెడ్డి.

Kotamreddy: కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో కొత్త ట్విస్ట్.. తెరమీదికొచ్చిన ఎమ్మెల్యే మిత్రుడు
Kotamreddy Sridhar Reddy
Sanjay Kasula
|

Updated on: Feb 08, 2023 | 6:08 PM

Share

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్‌. అది ట్యాపింగ్‌ కాదు ఆడియో అంటూ మీడియా ముందుకొచ్చారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి. కోటంరెడ్డి వినిపించిన ఆడియోలో అవతల వైపు ఉన్న వ్యక్తే ఈ రామశివారెడ్డి. తనది ఆండ్రాయిడ్‌ ఫోన్‌ అని, తన ఫోన్‌లో ప్రతి కాల్‌ రికార్డ్‌ అవుతుందని చెప్పారు.  ట్యాపింగ్‌ ఆరోపణలు, అసలు ఏం జరిగిందనేది పూర్తి వివరించి చెప్పారు. వేరొక కంట్రాక్టర్‌కు నా ఫోన్ నుంచి షేర్ అయ్యిందన్నారు. నా ఫోన్ కేంద్ర హోంశాఖకు.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడానికి సిద్ధమే అని అన్నారు. కేవలం యాధృచ్చికంగా కాల్ రికార్డయింది. ఒక కాంట్రక్టర్ నా ఫోన్‌లోని వాయిస్ రికార్డును తీసుకున్నారు. నా ఫోన్‌లోనే రికార్డయిందని నేనే చెబుతున్నా.. ట్యాపింగ్ అంటూ ఇంత వివాదం అవుతుందని ఊహించులేదు.

కోటంరెడ్డి చెబుతున్నట్లుగా ఇది ఫోన్ ట్యాపింగ్ కాదు.. ఇది కేవలం రికార్డింగ్ మాత్రమే అని తెలిపారు. మా ఇద్దరివీ ఐఫోన్‌లు అని కోటంరెడ్డి అబద్ధం చెప్పారు. నేను ఎవరో సీఎం జగన్‌కు తెలీదు. ఏదో ఊహించుకుని దుష్ర్పచారం చేస్తున్నారు. నాపై ఎవరి ఒత్తిడీ లేదు.. వాస్తవం చెప్పేందుకే మీడియా ముందుకొచ్చా. ట్యాపింగ్ అంటూ కోటంరెడ్డి ఇంత హంగామా చేసినందుకే సమాధానం చెప్పాలని వాస్తవాలు వెల్లడిస్తున్నాను. వైఎస్ కుటుంబంపై నాకు ఎనలేని విశ్వాసం ఉంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి

ఇదిలావుంటే, ఎమ్మెల్యే కోటంరెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేస్తుందని ఆరోపించిన కోటంరెడ్డి ఇప్పుడు ఈ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేశారు. కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వం.. వైసీపీ నేతల పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇప్పుడు ఎంపీ.. రూరల్ కొత్త ఇంఛార్జ్ ఆదాల పైన మండిపడ్డారు. ఆదాల నామినేషన్ల ముందు రోజు వైసీపీలో చేరారని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ప్రజలు తీర్పును శిరసా వహిస్తానని చెప్పారు. పార్టీ శ్రేణులు తనతోనే ఉంటారనే ఆశాభావం వ్యక్తం చేసారు. ఇటు కోటంరెడ్డి లక్ష్యంగా వైసీపీ నెల్లూరు రూరల్ లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో కోటంరెడ్డి కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కోటంరెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేసారంటూ ప్రభుత్వ పెద్దల పైన ఆరోపణలు చేసారు. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి తనకు తన ఫోన్ రికార్డు పంపారని.. ఆ రికార్డు తాను తన స్నేహితుడితో మాట్లాడిందిగా వెల్లడించారు. తనది..తన స్నేహితుడిది ఇద్దరిదీ ఐ ఫోన్ అని చెప్పిన కోటంరెడ్డి.. ఆ రెండు ఫోన్లలో రికార్డింగ్ అవకాశం లేదని చెప్పుకొచ్చారు. తనతో పాటుగా పలువురి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ కోటంరెడ్డి తీవ్ర ఆరోపణలు చేసారు.

దీని పైన మంత్రులు..మాజీ మంత్రులు స్పందించారు. ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. ఇప్పుడు ఇదే వ్యవహారం పైన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఎమ్మెల్యే కోటంరెడ్డి లేఖ రాసారు. తన ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని లేఖలో అభ్యర్ధించారు. అవకాశం వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖకు నేరుగా ఫిర్యాదు చేస్తానన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Follow Us
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..
పసుపు గణపతి మహిమ.. హరిద్రా గణపతి పూజతో విఘ్నాలు తొలగి ఐశ్వర్యం..
పసుపు గణపతి మహిమ.. హరిద్రా గణపతి పూజతో విఘ్నాలు తొలగి ఐశ్వర్యం..
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?