AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CM Jagan: సంక్షేమమే అజెండా… అక్టోబర్‌లో వారందరికీ సీఎం జగన్ వరాలు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే రాజీ పడటం లేదు.

AP CM Jagan: సంక్షేమమే అజెండా... అక్టోబర్‌లో వారందరికీ సీఎం జగన్ వరాలు
Cm Jagan
Ram Naramaneni
|

Updated on: Sep 22, 2021 | 8:15 PM

Share

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే రాజీ పడటం లేదు. అన్ని కులాల, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి జగన్ పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సీఎం జగన్ స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్టోబర్‌లో ప్రభుత్వం చేయబోయే సంక్షేమ కార్యక్రమాలపై బ్రీపింగ్ ఇచ్చారు. విజయదశమి రోజున ‘ఆసరా పథకం’ అమలు చేస్తున్నట్లు చెప్పారు. అక్టోబరు 7 నుంచి 10 రోజలుపాటు ‘ఆసరా పథకం’పై అవగాహన, చైతన్య కార్యక్రమాలు ఉంటాయన్నారు.  అవగాహన, చైతన్య కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సహా ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇందులో పాలుపంచుకోవాలని సూచించారు. మండలం ఒక యూనిట్‌గా ఈ కార్యక్రమాలు జరుగుతాయని సీఎం చెప్పారు. రూ.6500 కోట్ల రూపాయలను వైఎస్సార్‌ ఆసారా కింద ఇస్తున్నామని..  దాదాపు 80లక్షల మందికిపైగా మహిళలు లబ్ధిపొందుతారని ముఖ్యమంత్రి వెల్లడించారు.  ఇది ప్రభుత్వం చేపడుతున్న అతిపెద్ద కార్యక్రమన్నారు.  క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమం (క్లాప్‌) అక్టోబరు 1న ప్రారంభమవుతుందని చెప్పారు.

ఇక అక్టోబరు 19న ‘జగనన్న తోడు’ కార్యక్రమం ఉంటుందని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని చిరు వ్యాపారులు, సాంప్రదాయ వృత్తి కళాకారులను ‘జగనన్న తోడు’  స్కీమ్ ద్వారా ఏపీ సర్కారు ఆదుకుంటుంది.  దీనికింద లబ్ధిదారులకు వడ్డీలేని రుణాలను ప్రభుత్వం అందిస్తోంది. రుణాలపై వడ్డీని ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తోంది.  అక్టోబరు 26న రైతులకు ‘‘వైయస్సార్‌ సున్నావడ్డీ రుణాలు’’ కార్యక్రమం ఉంటుందని సీఎం వివరించారు. దీంతోపాటు ఈ ఏడాది ‘రైతు భరోసా’ రెండో విడత నిధులను కూడా సీఎం అక్టోబర్‌లోనే విడుదల చేయనున్నారు.

సచివాలయాల సందర్శనకు స్వయంగా సీఎం

విలేజ్, వార్డు సచివాలయాల్లో నిత్యం తనిఖీలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. విలేజ్, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యమైనవని.. ఈ విషయంలో అలసత్వం వహిస్తే చర్యలకు వెనకాడమని సీఎం స్పష్టం చేశారు.  కలెక్టర్లు ప్రతి వారం 2 సచివాలయాలు, జాయింట్‌ కలెక్టర్లు వారానికి 4 సచివాలయాలు విజిట్ చేయాలని ఆదేశించారు.  మున్సిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్‌ కలెక్టర్లు వారానికి నాలుగు సచివాలయాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. అధికారులు వెళ్లకపోతే, సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూడకపోతే పరిపాలన మెరుగుపడదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. వచ్చే నెలనుంచి ఎమ్మెల్యేలు కూడా వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలని చెప్పనున్నట్లు వివరించారు.  డిసెంబర్‌ నుంచి తాను కూడా సచివాలయాలను సందర్శిస్తానని సీఎం చెప్పారు.

Also Read: అమ్మ ఎగ్​ దోశ తినేందుకు డబ్బులివ్వలేదని.. ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

సన్​రైజర్స్​ ఆటగాడికి కరోనా పాజిటివ్.. సాయంత్రం ఢిల్లీతో మ్యాచ్​‌ గురించి తాజా అప్‌డేట్ ఇదే