Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అమ్మ ఎగ్​ దోశ తినేందుకు డబ్బులివ్వలేదని.. ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

టీనేజ్ దశలో ఉన్నవారు, యువత చిన్న, చిన్న కారణాలకే జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్నారు. భవిష్యత్‌లో సాధించాల్సిన లక్ష్యాలను, బ్రతుకునిచ్చిన అమ్మనాన్నలను మర్చిపోయి క్షణికావేశంలో తనువు చాలిస్తున్నారు.

Andhra Pradesh: అమ్మ ఎగ్​ దోశ తినేందుకు డబ్బులివ్వలేదని.. ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య
Egg Dosa
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 22, 2021 | 5:38 PM

టీనేజ్ దశలో ఉన్నవారు, యువత చిన్న, చిన్న కారణాలకే జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్నారు. భవిష్యత్‌లో సాధించాల్సిన లక్ష్యాలను, బ్రతుకునిచ్చిన అమ్మనాన్నలను మర్చిపోయి క్షణికావేశంలో తనువు చాలిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా తలారివారిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. ఎగ్​ దోశ తినేందుకు కుటుంబ సభ్యులు డబ్బులు ఇవ్వలేదన్న మనస్తాపంతో సాయికిరణ్‌ అనే ఇంజినీరింగ్‌ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. పాకాల మండలం తలారివారిపల్లెకు చెందిన సాయికిరణ్‌ ప్రస్తుతం ఇంజినీరింగ్‌ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అతని తండ్రి రమణయ్య గతంలోనే మృతి చెందారు. తల్లే ఇన్నాళ్లు పెంచింది. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా చదివస్తూ వస్తుంది. మంగళవారం ఉదయం సాయికిరణ్​కు ఎగ్​ దోశ తినాలనిపించి తల్లిని డబ్బులు అడిగాడు.

ఇంట్లో అన్నం, కూరా చేశా తినమని.. డబ్బులు వృథా ఖర్చు చేయొద్దని తల్లి కాస్త గట్టిగా చెప్పింది. కుటుంబ సభ్యులు తనకు నచ్చింది కూడా తినేందుకు డబ్బులివ్వడం లేదని మనస్తాపం చెందాడు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సాయికిరణ్.. ఇరంగారిపల్లె దగ్గర్లోని గుర్రప్పకుటంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పనుల నిమిత్తం అటుగా వెళ్తున్న రైతులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు.. డెడ్‌బాడీని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంత చిన్న విషయానికే చేతికొచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో సాయికిరణ్ తల్లి దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది. ఆమె ఏడ్చిన తీరు అక్కడున్నవారిని కూడా కంటతడి పెట్టించింది.

Also Read: సన్​రైజర్స్​ ఆటగాడికి కరోనా పాజిటివ్.. సాయంత్రం ఢిల్లీతో మ్యాచ్​‌ గురించి తాజా అప్‌డేట్ ఇదే

 పెళ్లైన తర్వాత అతడు తనకు అన్న అవుతాడని తెలుసుకుంది.. ఆపై ఊహించని విధంగా..