Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్.. శ్రీవారి దర్శనాలపై టీటీడీ ఆంక్షలు.. కీలక నిర్ణయం తీసుకున్న దేవస్థానం
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం ఎంతో మంది క్యూలో ఉంటారు. సంవత్సరం పొడవునా ఏ ఒక్క రోజు కూడా తిరుమల శ్రీవారి భక్తుల రద్దీ తగ్గదు. రోజురోజుకు..
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంతో మంది క్యూలో ఉంటారు. సంవత్సరం పొడవునా ఏ ఒక్క రోజు కూడా తిరుమల శ్రీవారి భక్తుల రద్దీ తగ్గదు. రోజురోజుకు పెరుగుతూనే ఉంటారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. కొండకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనాలపై ఆంక్షలు విధించింది.
కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్‌తో భక్తులు దర్శనాలకు రావాలని టీటీడీ సూచించింది. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్‌తో వస్తేనే దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ఇక సెప్టెంబర్ 25న ఆన్‌లైన్‌లో సర్వదర్శన టికెట్లను విడుదల చేస్తామని, 26వ తేది నుండి ఆఫ్ లైన్ టోకెన్ల జారీ నిలిపివేస్తాం టీటీడీ తెలిపింది. ఇక ఈ నెల 26 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. రోజుకు 8వేల టికెట్లు విడుదల చేయనున్నట్టు తెలిపింది. 24న 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కూడా అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. కోవిడ్ నియంత్రణకు టీటీడీ తీసుకున్న నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు.