TTD Prasadam: శ్రీవారి ప్రసాదానికి నాసిరకం జీడిపప్పు సరఫరా?.. విషయం బహిర్గతం అవడంతో..
Tirumala Temple: శ్రీవారి ప్రసాదానికి నాసిరకం జీడిపప్పును సరఫరా చేస్తున్నారా? అలిపిరి టీటీడీ వేర్‌హౌస్ కేంద్రంగా భారీ గోల్‌మాల్ జరుగుతోందా? అంటే.. అవుననే చెబుతున్నాయి
Tirumala Temple: శ్రీవారి ప్రసాదానికి నాసిరకం జీడిపప్పును సరఫరా చేస్తున్నారా? అలిపిరి టీటీడీ వేర్‌హౌస్ కేంద్రంగా భారీ గోల్‌మాల్ జరుగుతోందా? అంటే.. అవుననే చెబుతున్నాయి టీటీడీలోని విశ్వసనీయ వర్గాలు. శ్రీవారి ప్రసాదాలకు కాంట్రాక్టర్ నాసిరకం జీడిపప్పును అంటగట్టెందుకు యత్నించినట్లు సమాచారం. బెంగళూరుకు చెందిన హిందుస్తాన్ ముక్తా కంపెనీ గత కొద్ది నెలలుగా పాడైపోయిన జీడిపప్పును పంపుతోందని తెలుస్తోంది. అయితే, తాజాగా విషయం వెలుగులోకి రావడంతో ఆ జీడిపప్పు నాసిరకంగా ఉందని టీటీడీ అధికారులు 10 లోడ్లను వెనక్కి పంపించారు. అయితే, టీటీడీ అధికారులు తిప్పి పంపించిన జీడిపప్పునే మళ్లీ ప్యాకింగ్ మార్చి హిందుస్తాన్ ముక్తా కంపెనీ పంపుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. నిత్య అన్నదానం, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయానికి కూడా నాసిరకం జీడిపప్పునే ఆ సంస్థ పంపుతోందని అంటున్నారు.
అయితే, జీడిపప్పు సరఫరా సంస్థతో మార్కెటింగ్ విభాగంలోని కొందరు ఉద్యోగులు కుమ్మక్కయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పురుగుపట్టిన జీడిపప్పు సరఫరాపై టీటీడీ అధికారులు సీరియస్‍గా ఉన్నట్లు సమాచారం. దీనిపై విజిలెన్స్ విభాగంతో విచారణ జరిపించారు అధికారులు. తాజాగా విజిలెన్స్ వేదిక అందడంతో.. దాని ప్రకారం కాంట్రాక్టర్‌తో పాటు ఇంటి దొంగలపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే, దీనిపై మీడియా ప్రతినిధులు వివరణ కోరగా.. ఇది రొటీన్ ప్రాసెస్ అని, తనిఖీల్లో అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయని, నాసిరకం వస్తువులను గుర్తించి వెనక్కి పంపడం సాధారణమే అని అధికారులు ఆఫ్‌ది రికార్డ్‌లో చెప్పారు.
Also read:
EPFO Subscribers: ఈపీఎఫ్‌వోలో 14.65 లక్షల మంది సభ్యుల చేరిక.. వివరాలు వెల్లడించిన సంస్థ