IPL 2021: సన్‌రైజర్స్ ఆటగాడికి కరోనా పాజిటివ్.. సాయంత్రం ఢిల్లీతో మ్యాచ్ గురించి తాజా అప్‌డేట్ ఇదే
DC vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోని ఓ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే సాయంత్రం మ్యాచ్ నిర్వహణపై ఐపీఎల్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది.
ఐపీఎల్లో మరోసారి కరోనా కలకలం రేగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు క్రికెటర్ నటరాజన్‌కు వైరస్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం అతడికి ఎటువంటి లక్షణాలు లేవు. దీంతో అతడితో సన్నిహితంగా ఉన్న మరో ఆరుగురు (ఆటగాళ్లు, సిబ్బంది) ఐసోలోషన్‌లోకి వెళ్లారు. మిగతా ఆటగాళ్లు, సిబ్బందికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా రిపోర్ట్స్ నెగిటివ్‌గా వచ్చాయి.
తాజా అప్‌డేట్ ఏంటంటే.. మిగిలిన ప్లేయర్లకు రెండు సార్లు చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో నేటి సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సజావుగా సాగుతుందని ఐపీఎల్ యాజమాన్యం ప్రకటించింది.
ఐపీఎల్ 2020 సీజన్‌లో యార్కర్లతో అదిరిపోయే బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన నటరాజన్, ఆ పర్ఫామెన్స్ కారణంగా భారత జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా టూర్‌లో వన్డే, టీ20, టెస్టుల్లో అరంగ్రేటం చేసి రికార్డు క్రియేట్ చేసిన నట్టూ, ఆ టూర్ తర్వాత గాయాల బారినపడి జట్టుకి దూరమయ్యాడు. గాయం కారణంగానే ఐపీఎల్ 2021 ఫేజ్ 1కి దూరమైన నటరాజన్.. దాని నుంచి కోలుకుని ఫేజ్ 2లో సత్తా చాటాలని భావించాడు. అయితే ఈసారి కోవిడ్ అతన్ని ఆశలపై నీళ్లు చల్లింది. మరోవైపు.. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉండగా సన్‌రైజర్స్ అట్టడుగు స్థానంలో ఉంది.
Sunrisers Hyderabad player T Natarajan tested positive for #COVID19 at a scheduled RT-PCR test. The player has isolated himself from the rest of the squad. He is currently asymptomatic. The medical team has also identified 6 close contacts of the player: Indian Premier League pic.twitter.com/Jbzfd5iDJK
— ANI (@ANI) September 22, 2021
నటరాజన్ సన్నిహితులుగా మెలిగిన ఆరుగురు సభ్యులు ఆల్ రౌండర్ విజయ్ శంకర్, టీమ్ మేనేజర్ విజయ్ కుమార్, ఫిజియోథెరపిస్ట్ శ్యామ్ సుందర్ జె, టీమ్ డాక్టర్ అంజనా వన్నన్, లాజిస్టిక్స్ మేనేజర్ తుషార్ ఖేడ్కర్, నెట్ బౌలర్ పెరియసామి గణేషన్‌గా గుర్తించారు. వీరు ఐసోలేషన్‌లోనే ఉండనున్నారు.
ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా ఏప్రిల్ నెలలో జరగాల్సిన ఐపీఎల్ 2021 టోర్నీ… వాయిదా పడింది. కోవిడ్ వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో దుబాయ్ లో పునః ప్రారంభం అయిన ఈ ఐపీఎల్ 2021 టోర్నీని… ఇక్కడ కూడా ఈ మహమ్మారి వదలడం లేదు.
Also Read: పెళ్లైన తర్వాత అతడు తనకు అన్న అవుతాడని తెలుసుకుంది.. ఆపై ఊహించని విధంగా..