Andhra Pradesh: అర్ధరాత్రి రెచ్చిపోయిన దొంగలు.. పందులు దొంగతనం చేసిన ముసుగు వీరులు..
తాళం వేసిన ఇళ్ళు టార్గెట్‌గా చేసుకుని ఇళ్ళు గుల్ల చేసే దొంగలను చూసాం.. బైకును బయటపెడితే ఎత్తుకెళ్లే దొంగలను చూసాం... అవకాశం వస్తే దేన్ని వదలకుండా బంగారం, డబ్బు, వస్తువులు అందిన కాడికి దోచుకెళ్లే దొంగలనూ ఇప్పటివరకు మనం చూశాం.. అయితే అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాలలో ముసుగు ధరించిన దొంగలు వింత చోరికి పాల్పడ్డారు. ఎవరు గుర్తు పట్టకుండా ముఖానికి ముసుగు ధరించి వచ్చి పందులను ఎత్తుకెళ్లారు. ముగ్గురు దొంగలు చెడ్డి గ్యాంగ్ తరహాలో చెడ్డీలు ధరించి అర్ధరాత్రి గ్రామంలో ప్రవేశించి..
అనంతపురం, ఆగష్టు 11: తాళం వేసిన ఇళ్ళు టార్గెట్‌గా చేసుకుని ఇళ్ళు గుల్ల చేసే దొంగలను చూసాం.. బైకును బయటపెడితే ఎత్తుకెళ్లే దొంగలను చూసాం.. అవకాశం వస్తే దేన్ని వదలకుండా బంగారం, డబ్బు, వస్తువులు అందిన కాడికి దోచుకెళ్లే దొంగలనూ ఇప్పటివరకు మనం చూశాం.. కొందరైతే పశువులను ఎత్తుకెళ్లు కూడా ఉంటారు. ఇంకా సిల్లీగా కోళ్లను, ఇంటి బయట ఆరేసిన దుస్తులు, చెప్పులను ఎత్తుకెళ్తుంటారు. అయితే అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాలలో ముసుగు ధరించిన దొంగలు వింత చోరికి పాల్పడ్డారు. ఎవరు గుర్తు పట్టకుండా ముఖానికి ముసుగు ధరించి వచ్చి పందులను ఎత్తుకెళ్లారు. ముగ్గురు దొంగలు చెడ్డి గ్యాంగ్ తరహాలో చెడ్డీలు ధరించి అర్ధరాత్రి గ్రామంలో ప్రవేశించి 30 పందులను ఎత్తుకెళ్లారు.
ఈ ఘటనకు సంబంధించి బాధితులు, స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. అమిద్యాల గ్రామానికి చెందిన పుల్లమ్మ అనే మహిళ పందులను పెంచుకుంటూ జీవనం సాగిస్తుంది. గ్రామంలోని రహదారి పక్కనే ఈ పందుల దొడ్డి ఉంది. అయితే, గురువారం అర్థరాత్రి సమయంలో కొందరుగు గుర్తు తెలియని అగంతకులు వచ్చి, ఆ పందులను దొంగిలించారు. బొలోరో వాహనంలో వచ్చిన దుండగులు.. రోడ్డుపైకి ఆ పందులను తొలుకొచ్చారు. ఆపై వాటిని బొలెరో వాహనంలో ఎక్కించి, ఎత్తుకెళ్లారు. దాదాపు 30 పందులను ఎత్తుకెళ్లారు దొంగలు. అయితే, ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు గ్రామ శివారులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
మరుసటి రోజు ఉదయం పుల్లమ్మ పందుల దొడ్డికి రాగా.. అక్కడ పందులు కనిపించలేదు. దాంతో షాక్ అయిన పుల్లమ్మ.. చుట్టుపక్కన వారిని పిలిచి విషయం తెలిపింది. పుల్లమ్మ, గ్రామస్తులంతా కలిసి ఈ చోరీ ఎవరు చేశారా? అని ఆరా తీశారు. ఈ క్రమంలో గ్రామ శివార్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను పరిశీలించారు. అందులో చోరీ చేసిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కొందరు దొంగలు.. ముఖానికి ముసుగులు వేసుకుని. బొలెరో వాహనంలో వచ్చారు. తమ వాహనాన్ని రోడ్డుపైనే నిలిపిన దొంగలు.. వారు మాత్రం పందుల దొడ్డి వద్దకు వెళ్లారు. అందులోని పందులను బొలెరో వాహనం వద్దకు తరలించారు. ఆపై బొలెరోలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. అయితే బొలెరో వాహనం నెంబర్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దాని ఆధారంగా బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వాహనాన్ని ట్రాక్ చేసే పనిలో ఉన్నారు.
అయితే, తెలిసిన వారు చేసిన పనే అని గ్రామస్తులు కొందరు అభిప్రాయపడుతుండగా… పందులను అపహరించడం వింతగా మరికొందరు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..