సినిమా స్టైల్‌లో బంగారం షాపులో చోరీ.. ఫార్చునర్ కారులో వచ్చి 28 లక్షల సొత్తుతో జంప్..!
గుంటూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఫార్చునర్ కారులో వచ్చి మరీ దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. పొన్నూరులోని లక్ష్మీ ప్రసన్న వెండి ఆభరణాల షాపులో షెటర్ తాళాలు పగులగొట్టి బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు.
గుంటూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఫార్చునర్ కారులో వచ్చి మరీ దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. పొన్నూరులోని లక్ష్మీ ప్రసన్న వెండి ఆభరణాల షాపులో షెటర్ తాళాలు పగులగొట్టి బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు. నలుగురు దొంగలు దుకాణంలో చొరబడి వెండి, బంగారు ఆభరణాలతోపాటు నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు బాధితుడు. చోరీ అయిన సొత్తు విలువ 28 లక్షల రూపాయలకుపైగా ఉంటుందని చెబుతున్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదుచేసుకుని దొంగల కోసం గాలిస్తున్నారు. అయితే ఇంతలోనే ఫార్చునర్ కారులో పరారవుతున్న ఓ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. బంగారు షాపులో చోరీకి పాల్పడిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. కాగా, సీసీ కెమెరాలో రికార్డు అయిన విజువల్స్ ఆధారంగా పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వీడియో చూడండి…
కారులో వస్తారు దర్జాగా దోచేస్తారు..!
ఇటీవల రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో అర్థరాత్రి దొంగలు హల్చల్ చేశారు. జాతీయ రహదారిపైపై ఉన్న ఐదు దుకాణాలు లూటీ చేశారు. కారులో వచ్చిన నలుగురు దొంగలు ఈ చోరీలకు పాల్పడినట్టు సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఇనుపరాడ్లతో దుకాణాల షెటర్లు పైకి లేపి చోరీకి పాల్పడ్డారు. దొంగతనాలు జరిగిన దుకాణాలను పోలీసులు పరిశీలించారు. క్లూస్ టీమ్ ఈ కేసుల దర్యాప్తు చేపట్టింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..