Andhra Pradesh: దోచుకెళ్లిన డబ్బు మళ్లీ అదే ఇంట్లో పెట్టి వెళ్లిన దొంగ.. అతను రాసిన లేఖ చదివి అందరూ షాక్
ఇంట్లో ఎవరూ లేకపోవడం చూసి.. ఇళ్లంతా దోచేశాడు దొంగ. అయితే నెక్ట్స్ డే నైట్ దోచుకెళ్లిన సొమ్మంత తీసుకువచ్చి మళ్లీ అదే ఇంట్లో పెట్టి వెళ్లాడు. ఓ లేఖ రాసి అక్కడ ఉంచి వెళ్లాడు.
Srikakulam District: శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ చోరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మొదటి రోజు చోరీకి గురైన డబ్బు.. రెండో రోజు ఇంటికి వచ్చేసింది. దొంగే ఆ డబ్బు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్లాడు. ఈసారి ఆ డబ్బుతో పాటు ఓ నోట్ కూడా పెట్టి వెళ్లాడు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బూర్జ మండలం(Burja Mandal) కొల్లివలస(Kollivalasa)లో ఈ వింత చోరీ వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన బెజ్జిపురపు చక్రధరరావు ఫ్యామిలీతో కలిసి ఈ సండే రోజున చుట్టాలింటికి వెళ్లాడు. వారు ఇంట్లో లేని రోజే.. పక్కాగా స్కెచ్ వేసి ఇంట్లో డబ్బులు కొట్టేశాడు దొంగ. సోమవారం చక్రధరరావు రిటన్ వచ్చేటప్పటికి.. ఇంటి తాళం పగలగొట్టి ఉండటంతో.. అనుమానంతో లోపలికి వెళ్లి చెక్ చేయగా.. బీరువాలో నగదు మొత్తం మిస్సయ్యింది. మొత్తం రూ.11.20 లక్షలు దోచుకెళ్లాడు దొంగ. దీంతో కుటుంబ సభ్యులంతా లబోదిబోమన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి వివరాలు సేకరించింది. వారు డబ్బు పోయాయని బాధలో ఉండగానే… సోమవారం నైట్ వెనుక డోర్‌కు వేసిన మరో తాళాన్ని పగలగొట్టి మళ్లీ ఇంట్లోకి ప్రవేశించాడు దొంగ. తీసుకెళ్లిన డబ్బుతో పాటు ఓ నోట్‌ను అక్కడ పెట్టి వెళ్లాడు. ‘అన్నావదిన సారీ.. ఇదే నా ఫస్ట్ దొంగతనం.. తెలియక తప్పు జరిగింది. క్షమించండి, నన్ను పట్టుకుంటే సూసైడే శరణ్యం’ అని అందులో రాసి ఉన్నట్లు తెలిసింది.
దీంతో మళ్లీ చక్రధరరావు పోలీసులను పిలిచి జరిగిన విషయం చెప్పాడు. వారు ఆ నగదును కోర్టులో అందజేసి.. తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఎవరో తెలిసిన వ్యక్తుల పనే అని భావిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోతున్నారని.. ప్రజలు LHMS(Locked House Monitoring System) సర్వీస్ వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి