Andhra Pradesh: పురుగుల మందు తాగి చనిపోయిన వ్యక్తి.. 40 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు.. ట్విస్ట్ ఏంటంటే..?

ప్రకాశం జిల్లాలో ఓ వింత ఘటన వెలుగుచూసింది. చనిపోయిన ఓ వ్యక్తి 40 రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు. దీంతో అందరూ కంగుతిన్నారు. అసలు విషయం ఏంటంటే...?

Andhra Pradesh: పురుగుల మందు తాగి చనిపోయిన వ్యక్తి.. 40 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు.. ట్విస్ట్ ఏంటంటే..?
Dead Man Returns
Follow us

|

Updated on: Jul 28, 2022 | 5:52 PM

Bizarre: ఒక్కోసారి మన కళ్లు మనల్ని మోసం చేస్తాయన్నది మరోసారి రుజువైంది. ప్రకాశం జిల్లా(Prakasam District) గిద్దలూరు మండలం(Giddalur Mandal)లో వెలుగుచూసిన ఓ వింత ఘటన గురించి తెలిస్తే మీరు కూడా ఔరా అంటారు. ముండ్లపాడుకు చెందిన సయ్యద్‌ మియా అనే మతిస్థిమితం లేని వ్యక్తి 40 రోజుల క్రితం పురుగుమందుతాగి మృతి చెందాడు. అందరిలాగే కుటుంబసభ్యులు మృతదేహానికి అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. ఖర్మకాండలు జరిపి… బంధువులను పిలిచి భోజనం పెట్టారు. ఇందులో అంత వింతేముందంటారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్‌. సరిగ్గా భోజనాల టైంకి సయ్యద్‌మియా ప్రత్యక్షం కావడంతో కుటుంబసభ్యులు షాక్‌ గురయ్యారు. కాసేపు తమను తాము నమ్మలేకబోయారు. ఎగాదిగా చూసిన తర్వాత అతను సయ్యద్‌ మియా నిజమేనని నిర్ధారించుకున్నారు. ఇంకేముంది చనిపోయాడనుకున్న సయ్యద్‌మియా ఇల్లు చేరేసరికి ఆ కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అసలు జరిగిందేమిటంటే.. పురుగులమందు తాగి చనిపోయిన వ్యక్తికి, సయ్యద్‌మియాకు దగ్గరి పోలికలు ఉన్నాయి. దీంతో కుటుంబసభ్యులు కూడా సయ్యద్‌ మియానే చనిపోయినట్లు భావించారు. అందరిలాగే రోదించారు. అంత్యక్రియలు చేశారు. ఒక్కసారిగా తిరిగొచ్చిన సయ్యద్‌మియాను చూసి తొలుత షాకయ్యారు. ఆ తర్వాత తేరుకున్నారు. ఆనందంలో మునిగిపోయారు. చనిపోయాడునుకున్న సయ్యద్‌ సడెన్‌ కనిపించడంతో ఆనందంగా ఉందంటున్నారు కుటుంబసభ్యులు. దీంతో ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేశారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం