AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiken Price Hike: చికెన్‌ ధరలు ఇంతలా ఎందుకు పెరిగాయి..? అసలు కారణం ఏంటో తెలుసా..?

Reasons For Chicken Price Increasing: ఆదివారం వచ్చిందంటే చాలు మంది వంటిళ్లలో కోడి కూర ఉడకాల్సిందే. వారంలో ఒక్కరోజైనా చికెన్‌ టేస్ట్‌ చేసే వారు మనలో చాలా మందే ఉంటారు. అంతలా మన జీవితంలో...

Chiken Price Hike: చికెన్‌ ధరలు ఇంతలా ఎందుకు పెరిగాయి..? అసలు కారణం ఏంటో తెలుసా..?
Chicken
Narender Vaitla
|

Updated on: Apr 07, 2021 | 7:51 PM

Share

Reasons For Chicken Price Increasing: ఆదివారం వచ్చిందంటే చాలు మంది వంటిళ్లలో కోడి కూర ఉడకాల్సిందే. వారంలో ఒక్కరోజైనా చికెన్‌ టేస్ట్‌ చేసే వారు మనలో చాలా మందే ఉంటారు. అంతలా మన జీవితంలో చికెన్‌ ఓ భాగమైపోయింది. మటన్‌తో పోలిస్తే చికెన్‌ తక్కువ ధరకు లభించడం, ఎక్కువ పోషకాలు ఉండడంతో చాలా మంది తమ మెనూలో చికెన్‌ను భాగం చేసుకుంటుంటారు. ఇలా సామన్యుడికి అందుబాటులో ఉన్న చికెన్‌ ఇటీవల కొండెక్కి కూర్చుంది. డబుల్‌ సెంచరీ దాటేసి కొన్ని ప్రాంతాల్లో ఏకంగా ట్రిపుల్‌ సెంచరీకి చేరువైంది. అయితే తక్కువ ధరకు అందుబాటులో ఉన్న చికెన్‌ ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడానికి పలు కారణాలు విశ్లేషిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ప్రజల్లో ఆరోగ్యంపై ఆసక్తి పెరగడం, రోగనిరోధక శక్తిని పెంచుకునే క్రమంలో పోషకాహార పదార్థాలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు తమ ఆహారంలో కోడి గుడ్డు, కోడి కూర ఉండేలా చూసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతమవుతోన్న ఇలాంటి తరుణంలో ప్రజలు చికెన్‌పై మక్కువ చూపిస్తున్నారు. అయితే డిమాండ్‌ తగ్గ స్థాయిలో ఉత్పత్తి లేకపోవడంతో చికెల్‌ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతేకాకుండా గత కొన్ని రోజులు క్రితం బర్డ్‌ ఫ్లూ కలకలం రేపడంతో పాల్ట్రీఫామ్‌ యజమానులు కూడా కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. ఇది కూడా చికెన్‌ ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా ఎండలు విపరీతంగా పెరగడం కూడా కోళ్ల ఉత్పత్తిపై ప్రభావం చూపించింది. వెరసి ఇవన్నీ చికెన్‌ ధరలు పెరగడానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

Also Read: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..పెరుగుతున్న కరోనా కేసులు.. 144 సెక్షన్ విధింపు.. గుంపులుగా బయటికి వెళ్లారో..

Viral Video: ఈ బుడ్డోడు వయసులోనే చిన్నోడు..దయా గుణంలో చాలా పెద్దోడు.. పిల్లలంటే ఇలా ఉండాలి..

Pariksha Pe Charcha 2021: ప్రధాని మోదీ విద్యార్థులతో ముఖాముఖీ… ‘పరీక్షా పే చర్చ’ లైవ్ వీడియో