TTD: టీటీడీ సంచలన నిర్ణయం.. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత.. ఎప్పటినుంచంటే!

TTD Key Decision: కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోన్న నేపధ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది...

TTD: టీటీడీ సంచలన నిర్ణయం.. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత.. ఎప్పటినుంచంటే!
TTD News
Follow us

|

Updated on: Apr 07, 2021 | 7:31 PM

TTD Key Decision: కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోన్న నేపధ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం టైంస్లాట్(ఎస్ఎస్‌డి) టోకెన్ల జారీని వచ్చే సోమవారం అనగా ఏప్రిల్ 12వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలియజేసింది. తిరుపతి నగరంలో కరోనా కేసులు క్రమేపీ పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది.

ప్రతీ రోజూ తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల కోసం వేల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. దీని వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదముంది. ఈ పరిస్థితుల్లో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరిగి సర్వదర్శనం టోకెన్ల ఎప్పుడు జారీ చేసేది ముందుగానే తెలియజేస్తామని తెలిపింది. కాగా,  మహారాష్ట్రలో కరోనా కేసులు ఉధృతమవుతున్న క్రమంలో షిర్డీ ఆలయ దర్శనాన్ని కూడా నిలిపేసిన విషయం విదితమే.

ఏపీలో కరోనా విలయం…

ఆంధ్రప్రదేశ్‌ను కరోనా మహమ్మారి మరోసారి హడలెత్తిస్తోంది. తాజాగా మంగళవారం సాయంత్రం నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 31,812 మంది సాంపిల్స్ సేకరించిన కోవిడ్ టెస్టులు నిర్వహించగా.. 2,331 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ ద్వారా వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా కారణంగా ఒక్క రోజులోనే 11 మంది మృత్యువాత పడ్డారు. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 853 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,276 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 91,32,74 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 89,27,36 మంది కోలుకున్నారు. 7,262 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

Also Read:

‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’.. దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే.!

ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!

ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!