నదీ వరద ఉధృతికి కొట్టుకుపోయిన శివుడి త్రిశూలం.. భయాందోళనల్లో భక్తులు!
మొంథా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తారంగా వర్షాలు పడ్డాయి. దీంతో రాష్ట్రంలోని నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నది పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు, గ్రామాలు జలమయం అయ్యాయి. మొంథా తుఫాన్ ప్రభావంతో ఏపీకి పొరుగు రాష్ట్రం అయిన ఒరిస్సాలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

మొంథా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తారంగా వర్షాలు పడ్డాయి. దీంతో రాష్ట్రంలోని నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నది పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు, గ్రామాలు జలమయం అయ్యాయి. మొంథా తుఫాన్ ప్రభావంతో ఏపీకి పొరుగు రాష్ట్రం అయిన ఒరిస్సాలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఒడిశాలోని భగలట్టి డ్యాం గేట్లు తెరవడంతో శ్రీకాకుళం జిల్లాలోని బహుదా నదికి మంగళవారం (అక్టోబర్ 28) రాత్రి నుంచి ఒక్కసారిగా వరద నీరు పోటెత్తింది. బుధవారం ఉదయానికి ఇచ్చాపురం వద్ద బహుదా నది వరద ఇన్ ఫ్లో 52వేల ఒక వంద క్యూసెక్కులకు చేరుకుంది.
బహుదా నది వరద ఉధృతికి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పాత హైవే వంతెన వద్ద బహుదా నదిలో నిర్మించిన బారి శివుడి విగ్రహం నీట మునిగింది. విగ్రహం మెడ వరకు వరద నీరు ప్రవహించింది. వరద ఉధృతికి శివుడి విగ్రహానికి ఉన్న త్రిశూలం అందరూ చూస్తుండగానే నదిలో కొట్టుకుపోయింది. ఇటీవలే నదీ గర్భంలో శివ లింగాన్ని స్థానిక భక్తులు ఏర్పాటు చేశారు. శివ లింగంపై గోపురం మాదిరిగా భారీ శివుడి విగ్రహాన్ని నిర్మించారు. నదీ ఉధృతికి రెండు రోజుల కిందట శివ లింగం మునిగిపోగా బుధవారం ఉదయం భారీ వరద ఉధృతికి భారీ శివుడు విగ్రహానికి అమర్చిన త్రిశూలం కొట్టుకుపోయింది.
అయితే ఈ ఘటనతో స్థానిక భక్తుల్లో ఆందోళన మొదలైంది. స్వామి వారి త్రిశూలం వరదలో కొట్టుకుపోవటం దేనికి సంకేతమో అని తెగ భయాందోళనలు చెందుతున్నారు. మరోవైపు బహుదా నది వరద ఉధృతికి ఇచ్చాపురం మండలంలోని నది పరివాహక ప్రాంతాలైన జగన్నాధపురం, ఇన్నేసుపేట, డొంకూరు, రత్తకన్నా, బెల్లుపడ గ్రామాల్లోకి చేరిన వరద నీరు చేరింది.వందల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
