AP weather report: ఏపీ వాసులకు అలర్ట్.. రానున్న మూడు రోజుల్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక తాజాగా రానున్న మూడు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం అల్పపీడనగా మారి ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక తాజాగా రానున్న మూడు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం అల్పపీడనగా మారి ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం మీద విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో శని, ఆది, సోమవారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలో ఆదివారం వరకు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలకు కూడా అవకాశం ఉందని తెలిపింది.
ఇక రాయసీమలోనూ తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే రాయలసీమలో ఇప్పటికే భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అనంతపురంలో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్థమైంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.



మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..
