AP Cabinet Meeting: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. ట్యాబ్‌ల పంపిణీ సహా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..

Andhra Pradesh Cabinet: ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

AP Cabinet Meeting: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. ట్యాబ్‌ల పంపిణీ సహా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..
Ap Cabinet
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 24, 2022 | 8:47 AM

Andhra Pradesh Cabinet: ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ ప్రారంభం కానుండగా.. ఈ భేటీలో దేవాదాయ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకు ఆమోదం తెలపనుంది మంత్రిమండలి. అలాగే ఉమ్మడి జిల్లాల జెడ్పి చైర్మన్లు పదవీకాలం పూర్తయ్యేవరకూ కొత్త జిల్లాలకు కొనసాగించేలా చట్ట సవరణకు ఆమోదం తెలుపనున్నారు. ఈ నెల 27న అమ్మఒడి పధకం నిధులు విడుదలకు చేసేందుకు ఆమోదిస్తారు. పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, ఈ నెల 27న అమ్మఒడి పధకం నిధులు విడుదలకు ఆమోదం తెలపనుంది క్యాబినెట్. ఇక 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీకి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇకపోతే 35 సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనుంది ప్రభుత్వం.

వివిధ సంస్థలకు 112 ఎకరాలు కేటాయింపు కేటాయించనున్నారు. రూ. 2,211 కోట్ల పెట్టుబడి, 2443 మందికి ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ప్రాజెక్టుల ప్రారంభానికి అనుమతివ్వనున్నారు. అదానీ గ్రీన్‌ ఎనర్జీ చేపట్టనున్న 3,700 మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పులివెందులలో పంక్చుయేట్‌ వరల్డ్‌ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ. 50 కోట్లతో పెట్టనున్న గార్మెంట్స్‌ తయారీ పరిశ్రమకు ఆమోదం తెలపనున్నారు. ఇక కృష్ణాజిల్లా మల్లవెల్లి ఫుడ్‌పార్కులో రూ. 150 కోట్లతో అవిసా ఫుడ్స్‌ ప్రయివేట్‌లిమిటెడ్‌ పెట్టనున్న రొయ్యల ప్రాససింగ్‌ పరిశ్రమకు ఆమోదం తెలపనున్నారు. కొప్పర్తిని టెక్స్‌టైల్‌ రీజియన్‌ అపారెల్‌ పార్క్‌గా తీర్చిదిద్దేందుకు ఆమోదం తెలిపనుంది క్యాబినెట్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..