రామతీర్థంలో టెన్షన్ టెన్షన్.. వివాదంగా మారిన ప్రోటోకాల్.. ముగిసిన ఆలయ శంకుస్థాపన..
ఇదే వేదికపై రాజకీయ వివాదం మళ్లీ మొదలైంది. మాన్సస్ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్న అశోకగజపతి రాజే ఈ ఆలయ కమిటీకి కూడా చైర్మన్. అయితే..
విజయనగరం జిల్లాలో రామతీర్థం కోదండ రామాలయం పునర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. అప్పట్లో విగ్రహాల ధ్వంసం వివాదం తర్వాత.. ఏపీ ప్రభుత్వం ఈ ఆలయం పునర్ నిర్మాణానికి సిద్ధమైంది. 10 గంటల 8 నిమిషాలకు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఇదంతా ఆధ్యాత్మిక వ్యవహారం. కానీ, ఇదే వేదికపై రాజకీయ వివాదం మళ్లీ మొదలైంది. మాన్సస్ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్న అశోకగజపతి రాజే ఈ ఆలయ కమిటీకి కూడా చైర్మన్. అయితే ఆనవాయితీ ఫాలో అవ్వడంలేదని, సంప్రదాయాలను పక్కనపెట్టారని, జరగాల్సిన మర్యాదలు లేవని ఆశోక్‌గజపతి ఆగ్రహించారు. అక్కడున్న బోర్డును పీకేసే ప్రయత్నం చేశారు. దీంతో మరో వర్గం రివర్స్ అయ్యింది. ఆయన్ను అడ్డుకుంది. ఆశోక్ గజపతిని ఉన్నపళంగా పక్కకు నెట్టుకుంటూ వెళ్లారు ఆక్కడి కొందరు వ్యక్తులు. అశోక్‌గజపతి లేవనెత్తిన ప్రోటోకాల్ టాపిక్‌తో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత కనిపిస్తోంది. ఈ ఉద్రిక్తత మధ్యే రామతీర్థంలో ఆలయానికి శంకుస్థాపన పూర్తిచేశారు.
3కోట్ల రూపాయల నిధులతో ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. 6 నెలల్లోనే ఆలయ నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారు. పూర్తి రాతి కట్టడంతో ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణం జరగనుంది. ఆలయంతో పాటు ధ్వజస్తంభం, వంటశాల, మెట్లమార్గం ఆధునికీకరణ, కోనేరును అభివృద్ధి చేయనున్నారు.
గతేడాది డిసెంబర్ 28న రాముని విగ్రహం ధ్వంసం తర్వాత నూతన విగ్రహ ప్రతిష్ట, ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. ఇప్పటికే ప్రధాన ఆలయం ప్రాంగణంలో నూతన విగ్రహ ప్రతిష్ట జరిపి పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Reservation: వారికి కూడా అవకాశం.. రిజర్వేషన్.. అంతేకాదు ఇక అక్కడ పోలీసులుగా..
Lok Sabha: సభలో మీ ఎంపీ ఏం చేస్తున్నారో చూడాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..
Honey for Skin: పట్టులాంటి చర్మం కోసం తేనెను ఉపయోగించండి.. ఎలా వాడాలో తెలుసుకోండి..