AP News: గుడిలో హనుమాన్ విగ్రహం పక్కనే లభ్యమైన అరుదైన అద్భుతం

శాసనాలు మన చరిత్రకు ఆధారాలు. అప్పటి సాంస్కృతిక, ఆచార వ్యవహారాలకు దర్పణాలు. తాజాగా ఆంధ్రాలో మరో అరుదైన శిలాశాసనం వెలుగులోకి వచ్చింది. ఎక్కడ.. ఏంటి.. అందులో ఏమి రాసి ఉంది వివరాలు తెలుసుకుందాం పదండి...

AP News: గుడిలో హనుమాన్ విగ్రహం పక్కనే లభ్యమైన అరుదైన అద్భుతం
Telugu Inscription
Follow us

|

Updated on: Mar 15, 2024 | 9:56 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా నేకరికల్లు మండలం రూపెనగుంట్ల గ్రామంలో అత్యంత పురాతనమైన తెలుగు శాసనం వెలుగు చూసింది. గ్రామంలో హనుమంతుడి శిల్పం పక్కన చెక్కబడిన తెలుగు శాసనం లభ్యమైంది. శాసనంలోని అక్షరాలు 1590 కామన్ ఎరా నాటివిగా చెబుతున్నారు. ఎపిగ్రఫీ డైరెక్టర్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం..  గ్రామంలోని హనుమంతుని ప్రతిమను భరద్వాజ గోత్రానికి చెందిన కొత్తపల్లి రాఘవయ్య కుమారుడు తిమ్మచి ప్రతిష్ఠించినట్లు శాసనం పేర్కొంది.

తెలుగు భాష ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు వాడుకలోకి వచ్చింది అనడానికి పక్కా చారిత్రక ఆధారాలు లేకపోయినా.. ఇలాంటి శాసనాలను బట్టి.. కొంతమేర అంచనా వేసే అవకాశం కలుగుతుంది.  ఇలా వెలుగుచూసే శాసనాల ద్వారా రాజుల చరిత్ర, పరిపాలనా విధానాలు, వంశ వివరాలు, ఆ కాలం నాటి ఆచార వ్యవహారాలు అర్ధమవుతాయి. క్రీస్తు పూర్వం నుంచి, వివిధ రాజ వంశాలు ఆయా ప్రాంతాలను ఏలినట్లుగా, ఆయా కాలాల్లో వేసిన రాతి శాసనాలు బయల్పడటం ద్వారా స్పష్టమవుతుంది.  చోళులు, పల్లవులు, గజపతులు, కాకతీయులు, చాళుక్యులు, విజయనగరరాజులు, రెడ్డిరాజులు తెలుగు ప్రాంతాలను ఏలినట్లు ఇప్పటికే బయటపడిన పలు శాసనాలు, ఇతర చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

తెలుగులో మొదట శాసనం వేసిన క్రెడిట్..  రేనాటి చోళులకే దక్కుతుందని పురావస్తు అధికారులు చెబుతున్నారు. తెలుగును అధికారభాషగా స్వీకరించింది వారేనని అంటున్నారు. కడప జిల్లాలో చాలా భాగాన్ని, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్ని భాగాలను కలుపుకుని రేనాడుగా వ్యవహరించారన్న ఆధారాలు పురావస్తు శాఖ వద్ద ఉన్నాయి. శ్రీలంకలో వాయువ్య, తూర్పు ప్రావిన్సులు కలిసే చోట తెలుగు, తమిళం భాషల్లో రాసిన ఓ రాగి శాసనం అప్పట్లో లభ్యమవ్వడం ఆసక్తిని రేపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..