Panchumarthi Anuradha: ఇలా.. ఏపీ సీఎం వైయస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు: పంచుమర్తి అనురాధ

ముసలివాళ్లను మోసం చేసిన ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారంటూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అన్నారు.

Panchumarthi Anuradha: ఇలా.. ఏపీ సీఎం వైయస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు: పంచుమర్తి అనురాధ
Cm Jagan Panchumarthi Anura
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 07, 2021 | 1:42 PM

Panchumarthi Anuradha: ముసలివాళ్లను మోసం చేసిన ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారంటూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అన్నారు. నిభందనల పేరుతో ఫించన్లు కోత కోసి వృద్దుల కడుపు మాడుస్తారా? అని ప్రశ్నించిన ఆమె, 3 వేల ఫించన్ అన్నారు.. 3 ఏళ్లు కావొస్తున్నా రూ. 300 కూడా పెంచలేదు. ఇది వైయస్. ఆర్. భరోసా కాదు జగన్ రెడ్డి నమ్మకద్రోహం అంటూ ఇవాళ ఆమె ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి..

పించన్ల పెంపుపై మాట తప్పి, నిభందల పేరుతో ఉన్న ఫించన్లు తొలగించి వృద్దులను మోసం చేసిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు. ఫించన్ రూ. 3 వేల పెంచుతామని చెప్పి మూడేళ్లు కావొస్తున్నా.. కనీసం రూ. 300 కూడా పెంచకపోగా కుంటి సాకులు చెబుతూ ఉన్న ఫించన్లు కోత కోసి వృద్దుల కడుపు మాడుస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇంట్లో ఎంత మంది అర్హులున్నా.. అందరికీ రూ.3వేల చొప్పున పెన్షన్ ఇస్తానని ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ఉంటే ఒక్కరికే ఫించన్ అని, ఫించన్ ఇచ్చే సమయానికి ఇంట్లోనే ఉండాలని పలు నిభంనదలు పెట్టి ఫించన్లు తొలగించటం సిగ్గుచేటు. జగన్ రెడ్డికి ఆదాయం సృష్టించడం చేతకాక, పాలన అంటే ఏంటో తెలియక.. పేదల పెన్షన్లను పీకేస్తున్నాడు. ఇంట్లో ఒక్కరికి మాత్రమే అంటూ పెన్షన్ ముసలోళ్ల నోటి దగ్గర కూడును కూడా లాక్కోవడం అత్యంత దుర్మార్గం. జగన్ రెడ్డీ.. ముందు ఆ పథకానికి వైఎస్ఆర్ భరోసా అనే పేరు తీసి.. జగన్ రెడ్డి నమ్మక ద్రోహమని పేరు పెట్టండి. గతంలో ప్రతి ఒక్క పెన్షన్ దారుడికీ.. ప్రతినెలా ఒకో తారీఖున వారి వారి ఖాతాల్లో సొమ్ము జమయ్యేది. ఇప్పుడు.. అసలు పెన్షనే దక్కే పరిస్థితి లేకుండా చేస్తున్నావ్. ఒక రేషన్ కార్డులో ఇద్దరు పెన్షన్ దారులుంటే పెన్షన్ ఇవ్వబోమనడం దుర్మార్గం కాదా.? ఒకవైపు.. రేషన్ కార్డులకు కేవైసీ పేరుతో పేదల్ని వేదిస్తున్నారు,. మరోవైపు.. కార్డుల్లో ఉన్నారని పెన్షన్ ఎత్తేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు.. దగా.. దౌర్జన్యం.. దుర్మార్గం తప్ప మరో విధానం లేకుండా పోయింది. అధికారం కోసం అలవికాని హామీలిచ్చి.. నేడు ఆదాయం లేక, పథకాలు అమలు చేయలేక.. పేదోడి పెన్షన్, రేషన్ కు కోత పెడుతూ మిగుల్చుకోవాలనుకుంటున్నారు.

చంద్రబాబు నాయుడు రూ.200 ఉన్న పెన్షన్ ఒక్కసారిగా రూ.2000 చేశారు. కానీ.. జగన్ పెంచుతానన్న రూ.వెయ్యికి ఐదేళ్లు పెంచుకుంటూ పోతా అన్నావ్. ఆ పెంచుతామన్న వాయిదాకూ రెండేళ్లుగా దిక్కులేదు. చంద్రబాబులా రూ.1800 పెంచాల్సి వస్తే.. ఎన్ని దశాబ్దాల సమయం తీసుకునేవారోనని ప్రజలు అనుకుంటున్నారు.

పెన్షన్ల సంఖ్యపైనా అబద్దాలు టీడీపీ హయాంలో 2019 మే నాటికి రాష్ట్రంలో 54.25 లక్షల మందికి పెన్షన్లు అందేవి. పెన్షన్ వయోపరిమితిని 62 నుండి 60కి తగ్గించడంతో దాదాపు 6లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరయ్యాయి. ఈ లెక్కన రాష్ట్రంలో మొత్తంగా 60 లక్షలకు పైగా పెన్షన్లు ఉండాలి. అధికారిక లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 55 లక్షలకు మించి పెన్షన్లు లేవు. మరి పెంపు ఎక్కడ జగన్ రెడ్డీ. ముఖ్యమంత్రి ఇకనైనా ముసలివాళ్లను మోసం చేయటం మాని తొలగించిన ఫించన్లు పునరుద్దరించాలి.

Sd/ పంచుమర్తి అనురాధ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Read also: Sonu Sood: ఆపద్భాంధవుడు సోనూసూద్‌కు గుడి నిర్మాణం.. నిత్యపూజలు. ఎక్కడంటే..?