బీజేపీ అంటే బాబు, జగన్, పవన్.. తెలంగాణ సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..

బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఆరోపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. స్టీల్ ప్లాంట్ ప్రైటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో కాంగ్రెస్ నిర్వహించిన న్యాయ సదస్సు బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్.. ఏపీలో ప్రశ్నించే గొంతులు లేవన్నారు.

Follow us
Ravi Kiran

|

Updated on: Mar 16, 2024 | 7:59 PM

బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఆరోపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. స్టీల్ ప్లాంట్ ప్రైటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో కాంగ్రెస్ నిర్వహించిన న్యాయ సదస్సు బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్.. ఏపీలో ప్రశ్నించే గొంతులు లేవన్నారు. వైసీపీ, టీడీపీ రెండూ ఢిల్లీలో మోదీకి మద్దతిచ్చే పార్టీలే అని విమర్శించారు. ఒకప్పుడు రాష్ట్రంలోని నేతలు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడితే.. ఇప్పుడు మాత్రం ఇక్కడి నేతలు ఢిల్లీలో రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని విమర్శించారు. ఏపీలో ప్రధాని మోదీని ప్రశ్నించే వారే లేరన్నారు. వైఎస్‌ఆర్ ఆశయాలను నెరవేర్చేవారే ఆయన నిజమైన వారసులు అన్నారు రేవంత్ రెడ్డి. షర్మిల వైఎస్‌ఆర్ ఆశయాల సాధన కోసం పని చేస్తున్నారని అన్నారు. ఎప్పటికైనా షర్మిల సీఎం అవుతారని చెప్పారు.