Andhra Pradesh: ఛీ ఛీ వీడు అసలు మనిషేనా.. పాఠాలు చెప్పాల్సింది పోయి పాడు పనులు..!
కనిగిరి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై పోలీసులు బాధిత విద్యార్ధిని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు రంగారెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో జరిగిన లైంగిక వేధింపుల వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని కనిగిరి ఇన్‌చార్జి సిఐ భీమా నాయక్ తెలిపారు.

విద్యాబుద్దులు నేర్పించి, విద్యార్దులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యాలయాల్లో లైంగిక వేధింపుల ఆరోపణలు ఇటీవల ఎక్కువయ్యాయి. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ గురించి బోధించాల్సిన గురువులే విద్యార్ధినుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరిలో అలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
తనపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని ఓ విద్యార్ధిని తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది. కీచక టీచర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే పోలీసుల విచారణలో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు.. పదిమందికి పైగా విద్యార్ధినుల పట్ల ఉపాధ్యాయుడు లైంగికంగా వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే స్కూల్ హెడ్మాస్టర్ కానీ, ఇతర ఉపాధ్యాయినులు పట్టించుకోలేదన్న ఆగ్రహంతో మహిళలు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు రంగారెడ్డిని విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు.
ప్రకాశం జిల్లా కనిగిరిలో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో విద్యార్ధినులపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపింది. సైన్స్ పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు రంగారెడ్డి పాఠశాలలో చదువుతున్న బాలికలపై గత కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. రెండు రోజుల క్రితం ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్ధినికి బ్లీడింగ్ కావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో తనపై సైన్స్ టీచర్ రంగారెడ్డి లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిపింది. బిత్తరపోయిన విద్యార్ధిని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్ధినులపై లైంగిక దాడికి పాల్పడ్డ రంగారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కనిగిరి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై పోలీసులు బాధిత విద్యార్ధిని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు రంగారెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో జరిగిన లైంగిక వేధింపుల వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని కనిగిరి ఇన్‌చార్జి సిఐ భీమా నాయక్ తెలిపారు.
కనిగిరిలో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు 630 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఇటీవల ఓ విద్యార్ధినికి ఎక్కువగా బ్లీడ్ అవడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. విద్యార్ధిని తనపై జరిగిన లైంగిక దాడి విషయం తెలిపడంతో తొలుత పరువు పోతుందని భయపడ్డారు. అయితే అదే సమయంలో మరికొంతమంది విద్యార్ధినులు కూడా తమపై కూడా లైంగిక దాడి జరిగిందని ముందుకు రావడంతో కలకలం రేగింది. గత కొంతకాలంగా విద్యార్ధినులపై ఉపాధ్యాయుడు రంగారెడ్డి లైంగిక దాడులకు పాల్పడుతున్నట్టు విద్యార్ధినులు హెడ్‌మాస్టర్‌కు, ఇతర ఉపాధ్యాయులకు చెప్పినా ఉపాధ్యాయుడు రంగారెడ్డి రాజకీయ పలుకుబడికి భయపడి ఎవరూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.
దీంతో నిందితుడు రంగారెడ్డితో పాటు పాఠశాలలోని హెడ్మాస్టర్, ఇతర ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్ధినుల తల్లిదండ్రలు ఆందోళనకు దిగారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాఠశాల దగ్గరకు చేరుకుని నిరసన తెలిపారు. లైంగిక దాడి గురించి తెలిసినా పట్టించుకోని ఇతర మహిళా టీచర్లను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్ధినుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు. కాగా, సంబంధిత ఉపాధ్యాయుడిని విధుల్లో నుంచి తొలగించి, తదుపరి చర్యలు సిద్ధమయ్యారు విద్యాశాఖ అధికారులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..