Andhra: ప్రేమ పెళ్లి ఒప్పుకోలేదని పేరెంట్స్‌కి రిటర్న్ గిఫ్ట్.. కూతురి మైండ్ బెండింగ్ ట్విస్ట్
ఆ కూతురు అట్లాంటి.. ఇట్లాంటి కూతురు కాదు మావా.. ప్రేమ పెళ్లి ఒప్పుకోలేదని.. ఏకంగా పేరెంట్స్‌కే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది.. ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి.

అది గుంటూరులోని ధనవంతులు నివసించే ప్రాంతం. విద్యానగర్‌లో వారం రోజుల క్రితం ఒక వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. దాదాపు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలు చోరికి గురయ్యాయి. వ్యాపారి ఇంట్లో లేని సమయంలో దొంగలు ఇంటి కిటీకి గ్రిల్ తొలగించి ఆ తర్వాత మొయిన్ డోర్‌ను నకిలీ తాళంతో తీసి బంగారు ఆభరణాలను పట్టుకుపోయారు. కుమార్తె పెళ్లి కోసం చేయించిన బంగారు ఆభరణాలు దొంగలు ఎత్తుకుపోవడంతో చాలా ఆవేదన చెందారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే ఇప్పటి వరకూ ఎటువంటి క్లూ లభ్యం కాలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఇంటి దొంగల పనై ఉండవచ్చని భావించారు. దీంతో పోలీస్ బుర్రకు పని పెట్టారు. ఇంట్లో వారి ఫోన్ కాల్స్ జాబితా తీసి దాన్ని జల్లెడ పట్టారు. పెళ్లి కుమార్తె ఫోన్ నెంబర్‌కు కాల్స్ వెళ్లడాన్ని గుర్తించారు. అయితే అన్ని కాల్స్ ఎందుకు చేసిందో మొదట పోలీసులకు అంతు చిక్కలేదు. ఆ తర్వాత దర్యాప్తు పేరుతో ఆమెను పిలిచి ప్రశ్నించారు. మొదట తనకేమీ తెలియదని చెప్పిన పెళ్ళి కుమార్తె తర్వాత అసలు విషయాన్ని బయట పెట్టింది.
ఆ వ్యాపారి కుమార్తె ఒక యువకుడిని ప్రేమించింది. అయితే ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఆమె మనస్థాపానికి గురైంది. అంతకముందే తన పెళ్లి కోసం చేయించిన బంగారు ఆభరణాలను మాయం చేయాలని ప్లాన్ వేసింది. ఇదే విషయాన్ని తన ప్రియుడికి చెప్పింది. తన తల్లిదండ్రులు ఊరు వెళ్లిన సమయంలో తన ప్రియుడికి అన్ని విషయాలు చెప్పి ఇంట్లోని బంగారు ఆభరణాలు చోరి చేయించింది. అయితే ఆమె అప్పుడు తల్లిదండ్రులతో పాటే ఉండటంతో ఎవరికి అనుమానం రాకుండా మేనేజ్ చేయగలిగింది. కాని ఫోన్ కాల్స్‌పై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. పెళ్లి కుమార్తె ఇచ్చిన సమాచారంతో ప్రియుడి ఇంటిలో ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రియుడి పరారీలో ఉండటంతో పోలీసులు ఇంకా ఈ కేసులో అరెస్ట్‌లు చేయలేదు.