Andhra: సుర్రుమంటున్న సూరీడు.. మండిపోతున్న మార్చి.. మరి మే నెల పరిస్థితి ఏంటి.?
ఏపీలో వచ్చే 3 రోజులు వడగాలులు విపరీతంగా వీచనున్నాయి. సూర్యుడు భగభగలు తట్టుకోలేకపోతున్నారు జనాలు. ఉదయం వేళ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరి వాతావరణ శాఖ ఇచ్చిన ఆ సూచనలు ఏంటో..? ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.. ఆ వివరాలు ఇలా..

ఉపరితల ద్రోణి ఒడిశా మధ్య ప్రాంతాల నుంచి దక్షిణ విదర్భ వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్ అంతర్భాగంగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఉపరితల ద్రోణి మరాఠ్వాడ నుంచి దక్షిణ తమిళనాడుపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు, అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో కొనసాగుతోంది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ & యానాంలలో ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి.
—————————————-
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు: —————————————————————————————————-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
ఈరోజు, రేపు, ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం లేదు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
ఈరోజు, రేపు, ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం లేదు.
రాయలసీమ:-
ఈరోజు, రేపు, ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం లేదు.
వడగాలుల ప్రభావం..
అలాగే బుధవారం రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలు వ్యవధిలో కర్నూలులో 41 డిగ్రీలు నమోదయ్యాయి. రాయలసీమలోని కర్నూలు, వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు, అనంతపురం.. కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, యానాం(పుదుచ్చేరి), కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.