మెడలో టీడీపీ కండువాతో హోం మంత్రికి ఎదురొచ్చాడు… తర్వాత ఏం జరిగిందో..!
అసలే ఆమె హోం మంత్రి.. ఆమె ఎక్కడ పర్యటించినా బందోబస్తు పక్కా ఉండటంతో పాటు.. శాంతి భద్రతలు సమస్య రాకుండా ఫుల్ అలెర్ట్ గా ఉంటారు పోలీసులు. విజ్ఞప్తులు, విన్నపాలతో వచ్చేవారిని సైతం ఫుల్ గా తనిఖీ చేస్తారు. అయితే.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్‌లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ హోంమంత్రి తానేటి వనతకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది.

అసలే ఆమె హోం మంత్రి.. ఆమె ఎక్కడ పర్యటించినా బందోబస్తు పక్కా ఉండటంతో పాటు.. శాంతి భద్రతలు సమస్య రాకుండా ఫుల్ అలెర్ట్ గా ఉంటారు పోలీసులు. విజ్ఞప్తులు, విన్నపాలతో వచ్చేవారిని సైతం ఫుల్ గా తనిఖీ చేస్తారు. అయితే.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్‌లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఎవరు పార్టీ అభిమానో, కార్యకర్తనో తెలియకపోయినా అందర్నీ పలకరిస్తున్నారు నేతలు. వారి సాదక బాధలను అడిగి మరీ తెలుసుకుంటున్నారు. అలాంటి సమయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని వైసీపీ ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ హోంమంత్రి తానేటి వనతకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం బల్లిపాడులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని గురించి ప్రజలకు వివరిస్తూ.. ముందుకు సాగుతున్నారు. అయితే అదే గ్రామంలో సోమరాజు అనే వృద్దుడి కుటుంబం నివసిస్తుంది. సోమరాజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు.. టిడిపి అంటే ఆయనకు ఎంతో అభిమానం. ఎక్కడికి వెళ్లినా మెడలో పసుపు కండువా ధరిస్తుంటాడు.
అయితే హోం మంత్రి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సోమరాజు ఇంటికి చేరుకున్నారు. హోం మంత్రి ఇంటి ముందు వచ్చి నిలబడగానే లోపల నుంచి సోమరాజు మెడలో తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని హోం మంత్రి తానేటి వనితకు ఎదురెళ్ళారు. ఆమెకు రక్షణగా ఉన్న పోలీసులు, స్థానిక నాయకులు మెడలోని తెలుగుదేశం పార్టీ కండువా తీసివేయాలని ఆయనకు సూచించారు. వారు ఎంత వారించినా సరే ఆయన మాత్రం వారెవర్ని లెక్కపెట్టలేదు. తన మెడలోని కండువా అలాగే ఉంచుకున్నారు. వృద్ధుడి మొండితనాన్ని హోంమంత్రి సైతం ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆ వృద్ధుడికి వివరించారు హోంమంత్రి. పెన్షన్ అందుతుందా లేదా అని వాకబు చేశారు. అతని సమాధానంతో హోంమంత్రి అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోయారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీన్ని తెలుగు తమ్ముళ్లు ఒక రకంగా ప్రచారం చేసుకుంటుంటే.. అధికార పార్టీ దానికి తగ్గట్టుగా తిప్పికొడుతోంది. 80 ఏళ్ల అనుభవం చూపిన తెగువ, ధైర్యం అంటూ ఎవరికి నచ్చిన రీతిలో వారు స్లోగన్లు పెడుతూ ఆయనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు సైతం ఏ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలనకు ఇది చక్కని ఉదాహరణ అని చెబుతున్నారు. కరుడు కట్టిన టీడీపీ కార్యకర్తలకు సైతం సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కౌంటర్ ఇస్తున్నారు. పార్టీలు చూడం అని తమ అధినేత చెప్పింది గ్రౌండ్ లెవెల్ లో అమలవుతుందంటున్నారు హోంమంత్రి తానేటి వనిత అనుచరులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




