Crocodile: అమలాపురం లో భయపెడుతున్న మొసలి.! తీవ్ర భయాందోళనలో స్థానికులు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మొసలి కలకలం రేపింది. అమలాపురంలో పెద్ద కాల్వగా పిలుచుకునే ప్రధాన కాలువలో మొసలి సంచరిస్తూ స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. నెల రోజులుగా కాలువలో సంచరిస్తుండటంతో కాలువలోకి దిగేందుకు భయపడుతున్నారు. పశువులను సైతం కాల్వలోనికి వదలడం లేదు. అంతేకాదు, స్థానికంగా అయ్యప్ప మాల వేసుకునే భక్తులు ఈ కాలువలోనే స్నానమాచరిస్తారు. మరోవైపు కార్తీకమాసం సమీపిస్తోంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మొసలి కలకలం రేపింది. అమలాపురంలో పెద్ద కాల్వగా పిలుచుకునే ప్రధాన కాలువలో మొసలి సంచరిస్తూ స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. నెల రోజులుగా కాలువలో సంచరిస్తుండటంతో కాలువలోకి దిగేందుకు భయపడుతున్నారు. పశువులను సైతం కాల్వలోనికి వదలడం లేదు. అంతేకాదు, స్థానికంగా అయ్యప్ప మాల వేసుకునే భక్తులు ఈ కాలువలోనే స్నానమాచరిస్తారు. మరోవైపు కార్తీకమాసం సమీపిస్తోంది. భక్తులందరూ ఈ కాలువలోనే పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపాలు వదులుతారు. ఈ క్రమంలో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నల్లవంతెన సమీపంలోని నడిపూడి వద్ద కాలువలో మొసలి సంచరిస్తుండగా గుర్తించిన స్థానికులు మున్సిపల్, అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. కాల్వలో ఎవరూ దిగరాదని, అమలాపురం మున్సిపల్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు మొసలిని పట్టుకునేందుకు ఇరిగేషన్, అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కాలువకు నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు. మొసలిని బంధించేందుకు కాలువలో వలలు ఏర్పాటు చేశారు అటవీశాఖ సిబ్బంది. కాలువకు నీరు నిలిపివేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చుట్టు పక్కల చాలా గ్రామాలకు సాగునీరు అందించే ప్రధాన కాలువ ఇదే. దాంతో రైతులు త్వరగా మొసలిని బంధించి పొలాలకు నీరు అందేలా చూడాలని వేడుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

