Mylavaram Politics: వైసీపీ వర్సెస్ టీడీపీ.. మైలవరంలో కాకరేపుతున్న మైనింగ్ పాలిటిక్స్..
మైలవరంలో మైనింగ్ వ్యవహారం వైసీపీ, టీడీపీల మధ్య సవాళ్లకు దారి తీసింది. తన బంధువులు ఉన్నట్లు నిరూపించాలని ఎమ్మెల్యే వసంత చేసిన ఛాలెంజ్ పై చాంతాడంత లిస్ట్ చెప్పారు మాజీ మంత్రి. వీళ్లంతా ఎవరంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగింది. అక్రమ మైనింగ్ పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నియోజకవర్గంలో యధేచ్చగా జరుగుతున్న మైనింగ్ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కలెక్టర్, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు దాడులు ప్రారంభించారు. రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లే మైనింగ్‌కు పాల్పడుతున్నారని.. నా బంధువులు ఉన్నారని దేవీనేని ఉమా కావాల్సి క్రియేట్ చేస్తున్నారంటూ ఆరోపించారు ఎమ్మెల్యే. నిరూపిస్తే దేనికైనా సిద్ధమని వసంత కృష్ణ ప్రసాద్ సవాల్ చేశారు.
మైనింగ్ వ్యవహారంలో తన బంధువులు ఉన్నట్లు నిరూపించాలని వసంత కృష్ణ ప్రసాద్ విసిరిన సవాల్ పై స్పందించారు మాజీ మంత్రి దేవీనేని. మీ బంధువులు అక్రమ వైనింగ్ లో లేరా? వీళ్లంతా ఎవరు? అంటూ చాంతాడంత లిస్ట్ చెప్పుకొచ్చారు. ఎన్నిసార్లు రాజీనామా డ్రామాలు ఆడతారంటూ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను ప్రశ్నించారు దేవినేని ఉమా..
రాజీనామాల డ్రామాలు ఆపి అక్రమ మైనింగ్ పై దోచుకున్న లెక్కలు బయట పెట్టాలంటూ డిమాండ్ చేశారు దేవినేని ఉమ. దోచుకున్న కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాలంటే .. కలెక్టర్ స్పందించాలి,అక్రమ మైనింగ్ దోషులను పట్టుకోవాలన్నారు మాజీ మంత్రి దేవినేని. దేవీనేని ఉమ కౌంటర్స్ పై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రీ కౌంటర్ ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..