ఏపీలో ఖాళీ అవుతున్న టీడీపీ.. రాజీనామా చేసిన కాపు నేతలు

రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైన పరిస్థితి మరిచిపోకముందే.. టీడీపీ కూడా అదే బాటలో పయనిస్తున్నట్టు కనిపిస్తుంది. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ 2019 నాటికి పూర్తిగా తన ప్రాభవాన్నికోల్పోయింది. కేవలం 23 అసెంబ్లీ స్ధానాలకే పరిమితమై చావుతప్పి కన్ను లొట్టబోయిన విధంగా తయారైంది. ఇప్పటికే టీడీపీ చెందిన పలువురు సీనియర్ నేతలు తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ బీజేపీలో చేరిపోయారు. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన టీడీపీ […]

ఏపీలో ఖాళీ అవుతున్న టీడీపీ.. రాజీనామా చేసిన కాపు నేతలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 29, 2019 | 6:52 PM

రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైన పరిస్థితి మరిచిపోకముందే.. టీడీపీ కూడా అదే బాటలో పయనిస్తున్నట్టు కనిపిస్తుంది. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ 2019 నాటికి పూర్తిగా తన ప్రాభవాన్నికోల్పోయింది. కేవలం 23 అసెంబ్లీ స్ధానాలకే పరిమితమై చావుతప్పి కన్ను లొట్టబోయిన విధంగా తయారైంది.

ఇప్పటికే టీడీపీ చెందిన పలువురు సీనియర్ నేతలు తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ బీజేపీలో చేరిపోయారు. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన టీడీపీ నేతలు సైతం పార్టీ మారుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు టీడీపీకి కాపు సామాజిక వర్గం అండగా నిలబడింది. అయితే దాన్ని నిలబెట్టుకోవడంలో పార్టీ నాయకత్వం సీరియస్‌గా దృష్టి సారించకపోవడంతో ఇప్పుడు ఆ వర్గం దూరమయ్యే పరిస్థితి తలెత్తింది.

ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసి ఓటమి పాలైన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరుపుల రాజా తాజాగా తన అనుచర వర్గంతో సహా టీడీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విధానాలు బాగోలేవంటూ ఆరోపించారు. సమీప భవిష్యత్తులో టీడిపిలో కాపులకు భవితవ్యం లేదని ఆరోపించారు. కాపు రిజర్వేషన్ల విషయంలో సీఎం జగన్ ఎన్నికలకు ముందే తన స్టాండ్ చెప్పారని, అదే విధంగా ఆయన కొనసాగుతున్నారని తెలిపారు. ప్రస్తుతం మంచి పరిపాలన అందిస్తున్న వైసిపి మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు వరుపుల రాజా. టిడిపిలో కాపులకు భవిష్యత్తు లేదనందున 80 శాతం మంది కాపులు టీడీపీ నుండి బయటకు రాబోతున్నారని వరుపుల రాజా తెలిపారు.