Chandrababu: విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారు.. వీడియో షేర్ చేసిన చంద్రబాబు..
వైసీపీ(YCP) పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. విద్యుత్ కోతలతో ప్రసూతి ఆసుపత్రిలో బాలింతల పరిస్థితి...
వైసీపీ(YCP) పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. విద్యుత్ కోతలతో ప్రసూతి ఆసుపత్రిలో బాలింతల పరిస్థితి వివరిస్తూ వీడియోను జత చేశారు. తీవ్రమైన విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో అనధికార పవర్ కట్(Power Cut) లతో ప్రజలు అల్లాడిపోతున్నారన్న చంద్రబాబు.. విద్యుత్ సరఫరా లేక ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు పడుతున్న బాధలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. నాడు మిగులు విద్యుత్ తో వెలుగులు నిండిన ఏపీలో నేడు చీకట్లు నిండడానికి కారుకులెవరని మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు కరెంట్ ఎందుకు పోతుందో పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారీగా పెరిగిన బిల్లులను ప్రజలు కిమ్మనకుండా కడుతున్నా ఈ కోతలు ఎందుకని ప్రశ్నించారు. ఓ వైపు గ్రామ గ్రామాన ప్రజలు కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. వాలంటీర్లకు సన్మానం అంటూ రూ.233 కోట్లు తగలేస్తూ పండుగ చేసుకుంటున్న ఈ ముఖ్యమంత్రిని నీరో కాక ఇంకేమనాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యుత్ కోతలను ప్రశ్నించిన సామాన్య ప్రజలపై బెదిరింపులు మాని, సమస్యను పరిష్కరించాలని హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయింది. తీవ్రమైన విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారు. గ్రామాల్లో అనధికార పవర్ కట్ లతో ప్రజలు అల్లాడిపోతున్నారు. విద్యుత్ సరఫరా లేక ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు పడుతున్న బాధలకు ఈ ముఖ్యమంత్రి ఏం సమాధానం చెపుతారు?(1/3) pic.twitter.com/yQW24jmnaz
— N Chandrababu Naidu (@ncbn) April 7, 2022
Also Read
Telangana: గవర్నర్ గౌరవ పోరు.. ప్రభుత్వంతో మరింత పెరిగిన దూరం.. భద్రాచలంలో ఏం జరుగుతుందో…?
Hyderabad: భారీగా డ్రగ్స్ వినియోగిస్తున్న ఐటీ ఉద్యోగులు.. వేటు వేసిన కంపెనీలు.. దర్యాప్తులో సంచలనాలు