TDP Mahanadu Highlights: వైసీపీతో యుద్ధం మొదలైంది.. ‘మహానాడు’లో చంద్రబాబు విశ్వరూపం..

| Edited By: Shiva Prajapati

Updated on: May 28, 2022 | 9:19 PM

TDP Mahanadu Highlights: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ వ్యవస్థపకుడు ఎన్టీఆర్ శతజయంతోత్సవాల ..

TDP Mahanadu Highlights: వైసీపీతో యుద్ధం మొదలైంది.. ‘మహానాడు’లో చంద్రబాబు విశ్వరూపం..

TDP Mahanadu Highlights: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ వ్యవస్థపకుడు ఎన్టీఆర్ శతజయంతోత్సవాల నేపథ్యంలో మహానాడు రెండో రోజున ప్రత్యేకంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ శతజయంతోత్సవాలకు నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరై మాట్లాడారు.

అలాగే ఒంగోలు జిల్లా అద్దంకి బస్టాండు నుంచి నిర్వహించిన ర్యాలీలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఎన్టీఆర్‌ పెద్ద సంస్కరణవాధి, ముందు చూపు ఉన్న నాయకుడని చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలోనే ఒంగోలు అభివృద్ధి జరిగిందన్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 May 2022 08:54 PM (IST)

    అఖండను అడ్డుకుంటారా? భారతి సిమెంట్స్‌ పర్మీషన్ ఇచ్చేది నేనే..

    అఖండ సినిమాను ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నించిందని చంద్రబాబు అన్నారు. అయినప్పటికీ.. ప్రజలపై నమ్మకం ఉంచి బాలకృష్ణ తన సినిమాను విడుదల చేశారని, అది సూపర్ సక్సెస్ అయిందని అన్నారు. సినిమా వాళ్లను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. ‘సినిమా విడుదల చేయాలంటే ప్రభుత్వ పర్మిషన్ కావాలా? రేపు జగన్ కంపనీ భారతీ సిమెంట్‌కు పర్మిషన్ ఇచ్చేది నేనే.’ అని వ్యాఖ్యానించారు చంద్రబాబు. ఛార్జీలన్నీ పెరిగాయని, వీర బాదుడు బాదుతున్నారని అన్నారు.

  • 28 May 2022 08:54 PM (IST)

    అమరావతిని నిర్వీర్యం చేశారు..

    ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తే.. దానిని నిర్వీర్యం చేశారని వైసీపీ పాలనా విధానాలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి పోవడం వలన రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందన్నారు. రాజధానిగా అమరావతికి జగన్ గతంలో మద్దతు తెలిపారని, అధికారం వచ్చాక రివర్స్ అయ్యారని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్నీ సమస్యలే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా మారిందని, పరిశ్రమలు పోయాయి.. కొత్తవి వస్తాయనే నమ్మకం లేదు అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు చెప్పిన ప్రత్యేక హోదా ఏమైంది? అని ప్రశ్నించారు చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాలను జగన్‌రెడ్డి కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారు ఆరోపించారు. సీఎం జగన్ ఆదాయం పెరుగుతంది.. ప్రజల ఆదాయం తగ్గుతోందని విమర్శించారు.

  • 28 May 2022 08:53 PM (IST)

    రైతులకు అండగా ఉంటాం..

    వైసీపీ పాలనలో రాష్ట్ర రైతాంగం అస్తవ్యస్తం అయ్యారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ నాశానం చేశారని ఆరోపించిన ఆయన.. ఏపీలో ఏ రైతు కూడా ఆనందంగా లేడని వ్యాఖ్యానించారు. జగన్ సర్కార్ రైతులకు ఇచ్చింది గోరంత.. చెప్పుకునేది కొండంత అని విమర్శించారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని, రైతులకు తాము అండగా ఉంటామని అన్నారు.

  • 28 May 2022 08:52 PM (IST)

    వైసీపీ పాలనలో 8 లక్షల కోట్ల అప్పు..

    వైసీపీ పాలనలో రూ. 8 లక్షల కోట్ల అప్పు అయ్యిందని చంద్రబాబు విమర్శించారు. ఆ అప్పు అంతా జగన్ కడతాడా? అని నిలదీశారు బాబు. తెచ్చిన అప్పులన్నీ జగన్ జేబులోకి వెళ్లాయని, వాటన్నింటినీ కక్కిస్తానని వ్యాఖ్యానించారు చంద్రబాబు. ఖబడ్దార్ వదిలే ప్రసక్తే లేదంటూ జగన్‌పై ఫైర్ అయ్యారు చంద్రబాబు. అవినీతి సొమ్మునంతా కక్కిస్తానని అన్నారు.

  • 28 May 2022 08:52 PM (IST)

    ఉద్యోగాలు లేవు..

    జగన్ పాలనలో ఉద్యోగాల ఊసే లేదని విమర్శించారు చంద్రబాబు. తాను ఐటీ ఉద్యోగాలిస్తే.. జగన్ వాలంటీర్ ఉద్యోగాలిచ్చారని అన్నారు. ఉద్యోగ సంఘాలకు జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. పీఆర్సీ సరిగా ఇచ్చాడా? సీపీఎస్ రద్దు చేశాడా? అని ప్రశ్నించారు. 30 లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పి.. మూడే ఇళ్లు కట్టించాడని విమర్శించారు. కరోనా కంటే జగన్ విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నష్టపోయిందన్నారు.

  • 28 May 2022 08:42 PM (IST)

    ఎవరికీ భయపడను.. బుల్లెట్‌లా దూసుకెళ్తా..

    భయపెట్టి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండంటూ వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు చంద్రబాబు. తాను ఎవరికీ భయపడనని, బుల్లెట్‌లా దూసుకెళ్తానని వ్యాఖ్యానించారు. ‘బాదుడే బాదుడు’ కు పోటీగా ప్రభుత్వం ‘గడపగడప’కు అని చేపట్టిందని, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక రావడంతో ఇప్పుడు బస్సు యాత్ర చేపట్టారని విమర్శించారు.

  • 28 May 2022 08:41 PM (IST)

    జనంలోకి ఎన్టీఆర్ ఆశయాలు..

    ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా జిల్లాల్లో మినీ మహానాడు కార్యక్రమాలు చేపడతామని పసుపు దళపతి చంద్రబాబు ప్రకటించారు. ఈ మహానాడు వేదికగా వైసీపీ అవినీతిని ఎక్కడికక్కడ ఎండగడతామని అన్నారు. జగన్ ఒక ఉన్నాది అని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. వైసీపీ పాలనలో ఏపీ మరో శ్రీలంకం అవడం ఖాయం అని వ్యాఖ్యానించారు. దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితి కూడా లేదన్నారు.

  • 28 May 2022 08:40 PM (IST)

    ఆ పోలీసుల గాలి మేం తీస్తామంటూ..

    మహానాడుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసిందని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ వాహనాల టైర్లలో గాలి తీశారని అన్నారు. అయినప్పటికీ.. భారీ స్థాయిలో జనాలు ‘మహానాడు’కు వచ్చారన్నారు. ఈ సభను చూసి జగన్‌కు పిచ్చెక్కిపోవడం ఖాయం అని వ్యాఖ్యానించారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. హద్దులు మీరిన పోలీసుల గాలి మేం తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.

  • 28 May 2022 08:40 PM (IST)

    జగన్ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత..

    మహానాడు వేదికపై మునుపెన్నడూ లేని రీతిలో ప్రసంగించారు చంద్రబాబు. అధికార వైసీపీ టార్గెట్‌గా బుల్లెట్ లాంటి వ్యాఖ్యలు విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి ప్రజలు సిద్ధం అయ్యారని పేర్కొన్న చంద్రబాబు.. త్వరలోనే జగన్‌ను ఇంటికి పంపేందుకు జనాలు ఉత్సాహంగా ఉన్నారన్నారు. ఉన్మాది జగన్ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైనా ఉందంటూ ఘాటైన పదజాలంతో ప్రసంగించారు.

  • 28 May 2022 08:39 PM (IST)

    ‘మహానాడు’ వేదికగా వైసీపీపై యుద్ధం ప్రకటించిన టీడీపీ..

    ‘మహానాడు’కు వేదికగా అధికార వైసీపీపై యుద్ధాన్ని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీని భూస్థాపితం చేస్తాంటూ భీష్మించారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్న డబ్బునంతా కక్కిస్తానంటూ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. ఒంగోలులో టీడీపీ ‘మహానాడు’ సభను భారీగా నిర్వహించారు. లక్షలాది మంది కార్యకర్తలు తరలిరాగా.. తన ప్రసంగంతో వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపారు చంద్రబాబు. ‘క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ నినాదాన్ని ఇచ్చారు. ఈ నినాదంతోనే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు చంద్రబాబు.

  • 28 May 2022 06:50 PM (IST)

    చంద్రబాబు ప్రసంగం లైవ్ వీక్షించండి..

  • 28 May 2022 06:48 PM (IST)

    వైసీపీతో యుద్ధం మొదలైంది.. ఆ పార్టీని భూస్థాపితం చేస్తాం: చంద్రబాబు

    వైసీపీతో యుద్ధం మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మహానాడులో ప్రసంగించిన చంద్రబాబు.. వైసీపీని భూస్థాపితం చేస్తామని అన్నారు. మహానాడుతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. మనం మనం కలిస్తే ప్రభంజనమే అని కార్యకర్తలనుద్దేశించి అన్నారు చంద్రబాబు.

  • 28 May 2022 06:16 PM (IST)

    టీడీపీని భూస్థాపితం చేస్తానన్న వాళ్లే గాలికి కొట్టుకుపోయారు..

    మహానాడులో టీడీపీ నేత నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీని భూస్థాపితం చేస్తానన్న వాళ్లే గాలికి కొట్టుకుపోయారని వ్యాఖ్యానించారు. శవాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారంటూ జగన్‌పై విరుచుకుపడ్డారు. అంతేకాదు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ అంటూ పరుషంగా అభివర్ణించారు.

  • 28 May 2022 06:12 PM (IST)

    జగన్ సంచలన కామెంట్స్ చేసిన నారా లోకేష్..

    వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నాయకుడు నారా లోకేష్ సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు రాముడు.. జగన్ రాక్షసుడు అని వ్యాఖ్యానించారు. కూల్చివేతలతో పాలన మొదలు పెట్టిన జగన్.. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. చీప్ లిక్కర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • 28 May 2022 06:10 PM (IST)

    కార్యకర్తలతో హోరెత్తిన మహానాడు.. పసుపుమయం అయిన ఒంగోలు..

    ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడుకు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు హాజరయ్యారు. అధినేత చంద్రబాబు, నారా లోకేష్, బాలకృష్ణ సహా ప్రముఖ నేతలంతా సభకు హాజరయ్యారు.

  • 28 May 2022 06:06 PM (IST)

    చంద్రబాబు రాముడు, జగన్ రాక్షసులు..: లోకేష్..

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని రాముడితో పోల్చిన నారా లోకేష్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను రాక్షసుడిగా అభివర్ణించారు. మహానాడులో ప్రసంగించిన లోకేష్.. కులాలు, ప్రాంతాల మధ్య జగన్ చిచ్చు పెడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.

  • 28 May 2022 05:15 PM (IST)

    మహానాడు సభ ప్రాంగణానికి చేరుకున్న నారా లోకేష్, బాలకృష్ణ..

    టీడీపీ ముఖ్య నేతలు నారా లోకేష్, బాలకృష్ణ మహానాడు సభ ప్రాంగణానికి చేరుకున్నారు. మరికాసేపట్ల చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు హాజరవుతారు.

  • 28 May 2022 05:13 PM (IST)

    న్యాయ భేరి యాత్ర చేపట్టే అర్హత మంత్రులకు ఉందా?

    ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ భేరి యాత్ర చేపట్టే అర్హత మంత్రులకు ఉందా? అని రాష్ట్ర మంత్రులకు బహుజన జేఏసీ నాయకులు బాలకోటయ్య బహిరంగ లేఖ రాశారు. మంత్రులు మోగించినా భేరీ మ్రోగడం లేదంటూ ఎద్దేవా చేశారు. మంత్రుల యాత్ర వృధా ప్రయాస అని అన్నారు. సామాజిక కులాల అభివృద్ధి అంటే మంత్రులకు తెలుసా? అని ప్రశ్నించారు బాలకోటయ్య.

  • 28 May 2022 04:37 PM (IST)

    ఒక్క ఛాన్స్ ఇచ్చి పెద్ద తప్పే చేశారు..

    తెనాలిలో ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్ అంటే.. ఒక్క తప్పిదం చేశారని ప్రజలనుద్దేశించి అన్నారు. చేసిన తప్పులకు ఇప్పుడు అనుభవిస్తున్నారని, ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు చెప్పారు బాలకృష్ణ. జగన్ సర్కార్ గుడిని, గుడిలోని లింగాన్ని మింగేసే రకం అంటూ సంచలన కామెంట్స్ చేశారు బాలయ్య. జగన్ పాలనపై ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. ఓటు అంటే నోటు కాదని ప్రజలు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.

  • 28 May 2022 04:34 PM (IST)

    మహానాడుకు వచ్చేవారికి పోలీసుల అడ్డంకులు..

    టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుకు వచ్చే వారికి పోలీసుల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. పార్కింగ్ పేరుతో మహానాడుకు వచ్చే వారి వాహనాలను అడ్డుకుంటున్నారు పోలీసులు. అయితే, పోలీసుల తీరుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • 28 May 2022 04:32 PM (IST)

    టీఆర్ఎస్‌లోని వారంతా ఎన్టీఆర్ శిష్యులే..: సోమిరెడ్డి

    టీఆర్ఎస్‌లో ఉన్న ప్రధాన నేతలంతా ఎన్టీఆర్ శిష్యులే అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి నేపథ్యంలో పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడిన ఆయన.. నెల్లూరు జిల్లాలో జరిగే ప్రతి పరిణామం ప్రత్యేకమైనదే అని అన్నారు. రాష్ట్ర, పార్టీ ప్రయోజనాల కోసం ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్‌కు ఇన్నేళ్లకైనా ఎన్టీఆర్ గుర్తొచ్చినందుకు సంతోషం అని చెప్పిన సోమిరెడ్డి.. టీఆర్ఎస్‌లో ఉన్న ప్రధాన నేతలంతా ఎన్టీఆర్ శిష్యులే అని అన్నారు.

  • 28 May 2022 03:17 PM (IST)

    ‘ఎన్టీఆర్ జీవితం.. ప్రపంచానికే ఆదర్శం’.. పార్లమెంట్‌లో నివాళులర్పించిన ఎంపీ కేశినేని నాని..

    ఎన్టీఆర్ గొప్ప మహనీయుడు అని కీర్తించారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. ఆయన తెలుగు ప్రజలకే కాదు.. భారత ప్రజల హృదయాల్లోనూ చోటుసంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా పార్లమెంట్‌ లో ఏర్పాటు చేసిన దివంగత నాయకులు నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ సేవలను స్మర్మించుకున్నారు.

  • 28 May 2022 02:59 PM (IST)

    హిందూపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభం..

    దివంగత నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా హిందూపురంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర ఈ క్యాంటిన్‌ను ప్రారంభించారు. భవిష్యత్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని ప్రకటించారు. ఎన్టీఆర్ ఆశీస్సుల వల్లే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. హిందూపురంను నందమూరి పురంగా భావిస్తున్నామని ఆమె చెప్పారు.

  • 28 May 2022 01:19 PM (IST)

    తెలుగు ప్రజల పౌరుషం నందమూరి తారకరామారావు

    తెలుగు ప్రజల పౌరుషం నందమూరి తారకరామారావు అని చంద్రబాబు అన్నారు. అద్దంకి బస్టాండు సెంటర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమల వేసి నివాళులు అర్పించారు. తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు NTR రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు.

  • 28 May 2022 12:18 PM (IST)

    ఎన్టీఆర్‌ ఒక యుగపురుషుడు- చంద్రబాబు

    ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి మహానాడు వేదిక వద్దకు చంద్రబాబు వచ్చి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ పెద్ద సంస్కరణవాధి, ముందు చూపు ఉన్న నాయకుడని చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలోనే ఒంగోలు అభివృద్ధి జరిగిందన్నారు.

    Chandrababu

  • 28 May 2022 12:13 PM (IST)

    ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన చంద్రబాబు

    ఒంగోలు జిల్లాలోని అద్దంకి బస్టాండు నుంచి నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సందర్భంగా చంద్రబాబు ఒంగోలులో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు.

  • 28 May 2022 12:08 PM (IST)

    ర్యాలీలో పాల్గొన్న చంద్రబాబు

    నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (NTR) జయంతి సందర్భంగా ఒంగోలులోని అద్దంకి బస్టాండు నుంచి టీడీపీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై మాట్లాడారు

  • 28 May 2022 12:04 PM (IST)

    NTRకు జూ.ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్‌ నివాళులు

    ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి రోజున నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర గల ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి మహానాయకుడి నివాళులు అర్పించడం ఆనవాయితీ. హరికృష్ణ కుమారులు, ప్రముఖ హీరోలు తారక్ (జూనియర్ ఎన్టీఆర్), కళ్యాణ్ రామ్ ఈ రోజు ఉదయమే ఎన్టీఆర్ ఘాట్ చేరుకున్నారు. తాతయ్యకు నివాళులు అర్పించారు.

  • 28 May 2022 12:01 PM (IST)

    రాష్ట్ర పరిస్థితిపై మహానాడులో పూర్తిగా మాట్లాడతా

    ఏపీ రాష్ట్ర పరిస్థితిపై మహానాడులో పూర్తిగా మాట్లాడతానని బాలకృష్ణ అన్నారు. మరోవైపు బాలకృష్ణ రాకతో నిమ్మకూరు గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.

  • 28 May 2022 11:59 AM (IST)

    యువకులు రాజకీయాల్లోకి రావాలి..

    యువకులు రాజకీయాల్లోకి రావాలి.. ఉత్సాహంతో పని చేయాలని నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదని, ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అంతా చూస్తున్నారని అన్నారు.

  • 28 May 2022 11:57 AM (IST)

    నిమ్మకూరులో 35 అడుగుల విగ్రహం

    నిమ్మకూరును పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. నిమ్మకూరు చెరువు వద్ద ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామని బాలకృష్ణ అన్నారు. 35 అడుగుల విగ్రహం ఏర్పాటుకు అంతా తీర్మానించామన్నారు. పేద ప్రజల కోసం ఎన్టీఆర్‌ పాటుపడ్డారని, ఆయన తెలుగు రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు.

  • 28 May 2022 11:55 AM (IST)

    తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు

    తెలుగు వారి గుండెల్లో ఎన్టీఆర్‌ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేలా నేనున్నానని ముందుకొచ్చారు. రెండు రూపాయాలకు కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చారు అని అన్నారు.

  • 28 May 2022 11:49 AM (IST)

    300 సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించారు

    సామాజికం, పౌరాణికం, ప్రతికూల పాత్రలను సైతం పోషించి మెప్పించారు. శ్రామికులు, రైతులు, అన్నార్ధుల కోసం తెలుగుదేశం పార్టీని తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించారని చెప్పారు. పౌరాణికం, నాటకాలు, సామాజిక అంశాలను టచ్ చేస్తూ సినీ కెరీర్ ‌లో 300 సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించారు.

  • 28 May 2022 11:47 AM (IST)

    భావోద్వేగానికి గురైన బాలయ్య

    తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టేందుకు నేనున్నాను అని ముందుకు వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ బాలక్రిష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. సామాన్య రైతుగా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆపై, ప్రభుత్వం ఉద్యోగిగా, కళాకారునిగా, ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు.

  • 28 May 2022 11:44 AM (IST)

    ఎన్టీఆర్‌ ఇల్లే ఒక నటనాలయం

    తల్లిదండ్రులు అంటే పార్వతీపరమేశ్వరులు లాంటి వారని, ఎన్టీఆర్‌ ఇల్లే ఒక నటనాలయం, ఆయన అందరి గుండెల్లో ఉన్నారని బాలకృష్ణ అన్నారు.

  • 28 May 2022 11:42 AM (IST)

    ఆత్మగౌరవం నిలబెట్టిన మహనీయుడు ఎన్టీఆర్

    స్వర్గీయ ఎన్టీఆర్ 99వ జయంతి వేడులకు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. టాలీవుడ్ హీరో నందమూరి బాలక్రిష్ణ నిమ్మకూరులో తన తండ్రి ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళి అర్పించారు. ప్రపంచ పటంలో తెలుగు సంతకం, ఆత్మగౌరవం నిలబెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని, నేటి నుంచి ఆయన శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.

  • 28 May 2022 11:38 AM (IST)

    ఎన్టీఆర్‌ 302 సినిమాల్లో నటించారు

    తెనాలిలో ఏడాది పాటు ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు నటుడు బాలకృష్ణ హాజరై నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ 302 సినిమాల్లో నటించారని అన్నారు.

  • 28 May 2022 11:34 AM (IST)

    ఎన్టీఆర్ ఘాట్‌ నివాళులు

    దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు చేరుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు నివాళులు అర్పించారు.

Published On - May 28,2022 11:31 AM

Follow us
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..