AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: త్వరలోనే తోపుదుర్తి బండారం మొత్తం బయటపెడతా.. పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు

పాదయాత్ర చేస్తోన్న తమను అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు సునీత. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి రైతులను నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి సూచనతోనే పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు సునీత.

Andhra Pradesh: త్వరలోనే తోపుదుర్తి బండారం మొత్తం బయటపెడతా.. పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు
Thopudurthy,paritala Sunith
Basha Shek
| Edited By: |

Updated on: Nov 23, 2022 | 10:11 AM

Share

రాప్తాడులో పొలిటికల్‌ హీట్‌ మళ్లీ పీక్స్‌కి చేరింది. పరిటాల, తోపుదుర్తి మధ్య డైలాగ్‌ వార్‌ హీట్‌ పుట్టిస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో అగ్గిరాజేస్తున్నారు ఇరువురు నేతలు. రాప్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన టీడీపీ నాయకురాలు పరిటాల సునీత… ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి టార్గెట్‌గా హాట్‌ కామెంట్స్‌ చేశారు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. ‘ప్రకాష్‌రెడ్డీ జాగ్రత్తగా ఉండూ’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. రైతుల కోసం తెలుగుదేశం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు పరిటాల సునీత. ఇప్పటికే కనగానపల్లి, రామగిరి మండలాల్లో పాదయాత్రను కంప్లీట్‌ చేసుకుని, ఇప్పుడు రాప్తాడు మండలంలో పర్యటిస్తున్నారు. అయితే, పాదయాత్ర చేస్తోన్న తమను అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు సునీత. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి రైతులను నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి సూచనతోనే పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు సునీత. త్వరలోనే ప్రకాష్‌రెడ్డి బండారం మొత్తం బయటపెడతానంటోన్న పరిటాల సునీత.. రాప్తాడులో జరుగుతోన్న అక్రమాలు సీఎం జగన్‌కు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు.

కాగా జాకీ పరిశ్రమకు కేటాయించిన భూములను తిరిగి రైతులకు అప్పగించే దమ్ము ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఉందా అని ఈ సందర్భంగా సవాల్ విసిరారు పరిటాల సునీత. రైతుల కోసం మొసలి కన్నీరు కార్చే ప్రకాష్ రెడ్డి.. అన్నదాతలకు చేసిందేమీ లేదన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని తన పాదయాత్ర కార్యక్రమాలకు ఆటంకాలు కలగజేస్తున్నారని ఆరోపించారు. ఏదేమైనా రైతుల కోసం పాదయాత్రను విజయవంతం చేస్తానని.. అవసరమైతే రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారామె.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..