Andhra Pradesh: అన్నమో రామచంద్రా.. బిల్లుల పెండింగ్‌తో ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల ఆకలి కేకలు

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పదకొండు ప్రభుత్వాస్పత్రుల్లో భోజనాలు బంద్‌ అయ్యాయి. దాంతో, హోటల్స్‌ నుంచి ఆహారం తెచ్చుకుని తింటున్నారు రోగులు. కోనసీమ జిల్లాలో మొత్తం 38లక్షల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటున్నారు అధికారులు.

Andhra Pradesh: అన్నమో రామచంద్రా.. బిల్లుల పెండింగ్‌తో ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల ఆకలి కేకలు
Amalapurm Hospital
Follow us

|

Updated on: Nov 23, 2022 | 11:49 AM

మొన్న రాజోలు ప్రభుత్వాస్పత్రి, ఇప్పుడు అమలాపురం ఏరియా ఆస్పత్రి. ఆహారం అందక ఇబ్బందులు పడుతున్నారు రోగులు. కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో ఫుడ్‌ సప్లై నిలిపివేశారు కాంట్రాక్టర్లు. అమలాపురం ఏరియా ఆస్పత్రిలో ఆహారం పంపిణీ నిలిచిపోవడంతో స్వచ్ఛంద సంస్థ భోజనాలు అందించింది. అన్నం, సాంబారుతో రోగులకు భోజనం పెట్టారు దాతలు. ఈ రెండు ఆస్పత్రులే కాదు.. జిల్లాలోని పదకొండు ప్రభుత్వాస్పత్రుల్లో భోజనాలు బంద్‌ అయ్యాయి. దాంతో, హోటల్స్‌ నుంచి ఆహారం తెచ్చుకుని తింటున్నారు రోగులు. కోనసీమ జిల్లాలో మొత్తం 38లక్షల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటున్నారు అధికారులు. అమలాపురం ఆస్పత్రికి 13లక్షలు, రామచంద్రాపురం 9లక్షలు, కొత్తపేట 6లక్షలు, రాజోలు 5లక్షలు, అల్లవరం లక్ష, కపిలేశ్వరం లక్ష, ఆలమూరు ఆస్పత్రికి 91వేలు, ముమ్మిడివరం హాస్పిటల్‌కి 81వేల రూపాయలు బిల్లులు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు. . కొన్ని నెలలుగా ఈ బిల్లులు చెల్లించకపోవడంతోనే కాంట్రాక్టర్లు ఫుడ్‌ సప్లై నిలిపివేశారని అంటున్నారు. బిల్లులు పెండింగ్‌ పెట్టడంతో కాంట్రాక్టర్లు ఫుడ్‌ సప్లై ఆపేశారని, దానికి తామేం చేయగలం అంటున్నారు హాస్పిటల్స్‌ ఇన్‌ఛార్జ్‌లు.

కాగా జిల్లాలోని దాదాపు అన్ని ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు. ప్రభుత్వాస్పత్రికి వచ్చేవాళ్లలో మెజారిటీ రోగులు పేదలే కావడంతో బయటికి నుంచి ఆహారం తెచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. హోటల్స్‌లో ఫుడ్‌ కొనుక్కొని తినే స్థోమత తమకు లేదని రోగులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, రోజువారీ ఆహారం ప్రొవైడ్‌ చేయాలని కోరుతున్నారు రోగులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!