AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అదానీని కలిసేందుకు దావోస్ వెళ్లాల్సిన అవసరం ఏముంది.. సీఎం జగన్ కు లోకేశ్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనపై టీడీపీ లీడర్ నారా లోకేశ్(Nara Lokesh) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ రాజధాని ఏదని అడిగితే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పీపీఏలను రాష్ట్రంలో....

Andhra Pradesh: అదానీని కలిసేందుకు దావోస్ వెళ్లాల్సిన అవసరం ఏముంది.. సీఎం జగన్ కు లోకేశ్ కౌంటర్
Lokesh
Ganesh Mudavath
|

Updated on: May 23, 2022 | 3:58 PM

Share

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనపై టీడీపీ లీడర్ నారా లోకేశ్(Nara Lokesh) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ రాజధాని ఏదని అడిగితే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పీపీఏలను రాష్ట్రంలో ఎందుకు రద్దు చేశారని అడిగితే ఏమని వివరణ ఇస్తారని నిలదీశారు. వైసీపీ నేతల మీటింగ్ జరుగుతున్నట్లే ఉంది కానీ పెట్టుబడుల కోసం జగన్ దావోస్(Davos) వెళ్లినట్లు కనిపించడం లేదని లోకేశ్ ఎద్దేవా చేశారు. సీఎం కలిసేందుకు ఏ పారిశ్రామిక వేత్త కూడా రావడం లేదని, గడిచిన 24 గంటల్లో ఆయన కలిసిన ఏకైక పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీయే. అదానీని కలిసేందుకు దావోస్‌ వెళ్లడం దేనికి? అని కౌంటర్ ఇచ్చారు. దావోస్‌కు నేరుగా వెళ్లకుండా లండన్‌ ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందన్న లోకేశ్.. ప్రభుత్వంపై ఏ చిన్న కామెంట్‌ చేసినా వెంటనే కేసులు పెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేయనప్పుడు తన కేసులను వెంటనే పరిష్కరించాలని కోర్టును జగన్‌ అడగొచ్చు కదా అని సూచించారు.

మరోవైపు.. దావోస్‌ పర్యటనలో ఉన్న సీఎం జగన్‌(CM Jagan) ప్యూచర్‌ ప్రూపింగ్‌ హెల్త్‌ సిస్టమ్‌పై జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఏపీలో కరోనా ఎదుర్కొన్న తీరును వివరించారు. కొవిడ్‌ టైమ్‌లో 44 సార్లు ఇంటింటి సర్వే నిర్వహించినట్లు చెప్పారు. జ్వరంతో ఉన్నవాళ్లను గుర్తించి మహమ్మారిని కట్టడి చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ గురించి తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజారోగ్యానికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని సీఎం జగన్ వెల్లడించారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నామని వివరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

Diabetes: మధుమేహ రోగులకి ఈ పండ్లు బెస్ట్‌.. ఎందుకంటే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్‌ తక్కువ..!

కాలం మారింది గురూ..! ఆన్ లైన్ లో పెళ్లి.. 70mm స్క్రీన్‌ ముందు కూర్చుని కన్యాదానం చేసిన వధువు తల్లిదండ్రులు

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్