బెజవాడకు పాకిన “డార్క్‌నెట్’ వర్క్ డ్రగ్స్ కల్చర్..దందాలో అసలు నిజం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..
చెన్నై, బెంగళూరు, ముంబాయ్, హైదరాబాద్ లాంటి నగరాలకే పరిమితమైన డ్రగ్ కల్చర్ ఇప్పుడు విజయవాడకు పాకింది...బెజవాడలో డ్రగ్స్ కల్చర్ డెవలప్ అవుతోంది... డార్క్ నెట్ యాప్ ద్వారా డ్రగ్స్ వాడకం జరుగుతోంది...
చెన్నై, బెంగళూరు, ముంబాయ్, హైదరాబాద్ లాంటి నగరాలకే పరిమితమైన డ్రగ్ కల్చర్ ఇప్పుడు విజయవాడకు పాకింది…బెజవాడలో డ్రగ్స్ కల్చర్ డెవలప్ అవుతోంది… డార్క్ నెట్ యాప్ ద్వారా డ్రగ్స్ వాడకం జరుగుతోంది… ఇటీవల వరుసగా డ్రగ్స్ ను పోలీసులు పట్టుకుంటున్నారు.. విజయవాడ నుంచీ కొరియర్ లో మొన్న డ్రగ్స్ వెళితే.. ఈసారి డ్రగ్స్ ట్రాన్స్ పోర్ట్ చేస్తున్న వ్యక్తిని కర్నూలు పోలీసులు అరెస్టు చేస్తే.. విజయవాడ విద్యార్ధుల పేర్లు బయటకొచ్చాయి.. వాళ్లను కర్నూలు పోలీసులు అరెస్టు చేసారు… విజయవాడ వచ్చి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులను తీసుకెళితే వాళ్ళతో పాటూ మరో ముగ్గురు డ్రగ్స్ కేసులో ఉన్నట్టు తెలిసింది.
డ్రగ్స్ తీసుకోవడానికి విజయవాడలో ఇంకా పబ్ కల్చర్ పూర్తిస్ధాయిలో రాకపోవడంతో మాదకద్రవ్యాలు సేవించేందుకు నగర శివారులను ఎంచుకుంటున్నారు.. కర్నూలు పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు విద్యార్ధులూ విజయవాడ నగర శివారు నున్న ప్రాంతంలో పోలీసులకు దొరికారు.. నగర శివారు ప్రాంతాలు కూడా దారుణంగా తయారయ్యాయి.. డ్రగ్స్, మద్యం తీసుకున్న ఆనవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతాలు విజయవాడలో ఉన్నాయి.. నున్న పరిసర ప్రాంతాలలో గమనిస్తే అనేక అసాంఘిక కార్యలకలాపాలకు అడ్డాగా ఆ ప్రాంతం కనిపిస్తుంది… గతంలో హత్యలు జరిగిన ప్రాంతం కూడా ఇదేనని తెలుస్తోంది.
డ్రగ్స్ విషయంలో పెడ్లర్స్, వినియోగదారులు వాడే యాప్ డార్క్ నెట్… ఇందులో లాగిన్ అయితేనే డ్రగ్స్ కొనే అవకాశం ఉంటుంది… అలాంటిది.. ఆ యాప్ లో లాగిన్ అవడం కూడా చాలా కష్టమే.. ఒకవేల ఈ యాప్ కావాలన్నా.. డ్రగ్స్ అలవాటున్న వారి స్నేహితులకు ఈ యాప్ దొరుకుతుంది… దానిలో లాగిన్ అవగానే ఆ యాప్ అడ్మిన్ లకు సమాచారం అందుతుంది.. దానితో వారు యాప్ డౌన్ లోడ్ చేసిన వ్యక్తికి కాల్ చేస్తారు.. అంతా ఓకె అనుకుంటే ఆర్డర్ తీసుకుంటారు.. వాళ్ళ అనుమతి వచ్చాక యాప్ కనిపిస్తుంది.. లేదా అంతా డార్కే.. ఆ యాప్ లో ఎవరి లాగిన్ లో వారి సమాచారమే ఉంటుందట.. ఏదేమైనా… రాష్ట్రానికి డ్రగ్స్ కేసు వస్తే అది విజయవాడకే దారి చూపిస్తుండటం.. పోలీసుకు పెను సవాలుగానే మారింది.