Delhi:అస్తవ్యస్తంగా మారిన హస్తిన వీధులు…ముందే కురిసిన వర్షాలతో బీభత్సం..వీడియోలు భయానకం
దేశ రాజధాని ఢిల్లీని ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం అతలాకుతలం చేసింది. సోమవారం తెల్లవారుజుము నుంచే ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీనికి ఈదురు గాలులు తోడవడంతో
దేశ రాజధాని ఢిల్లీని ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం అతలాకుతలం చేసింది. సోమవారం తెల్లవారుజుము నుంచే ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీనికి ఈదురు గాలులు తోడవడంతో రోడ్లపై చెట్లు విరిగిపడిపోయాయి. బలమైన ఈదురుగాలులు,మెరుపులతో కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరింది. దీంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది.
అదేవిధంగా విమానాల రాకపోకలకు అంతరాయం కూడా ఏర్పడింది. ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ విమానాల గురించిన సమాచారాన్ని తెలుసుకోవాలని, సంబంధిత సంస్థల అధికారులతో టచ్‌లో ఉండాలని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు సూచించారు. వర్షాకాలం సీజన్ ఇంకా ప్రారంభం కానేలేదు. అప్పుడే పడ్డ వర్షంతో ఢిల్లీ రోడ్లు చెరువులుగా మారాయి.
నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రతికూల వాతావరణంతో విమానాల రాకపోకలు నిలిపివేశారు.
#WATCH | Haryana: Several parts of Gurugram face waterlogging following the rainfall this morning. pic.twitter.com/4TloM8TIrF
— ANI (@ANI) May 23, 2022
పాత భవనాలపై పిడుగుల ప్రభావం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. మరోవైపు వర్షం కారణంగా జరిగిన నష్టంపై అధికారులు అంచనా వేస్తన్నారు.
Traffic Alert: Water logging has been reported near Bakhtawar chowk . Our traffic officials are on the spot to facilitate the traffic flow. Commuters are requested to plan their travel accordingly. @gurgaonpolice pic.twitter.com/pla6DhqgmB
— Gurugram Traffic Police (@TrafficGGM) May 23, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం టీవీ9 వెబ్ సైట్ చూస్తూనే ఉండి..ఎప్పటికప్పుడు తాజా అప్ డేట్స్ మీ కోసమే..