AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flight: ఆకాశవీధిలో భారీగా పెరిగిన ప్రయాణాలు.. నాలుగు నెలల్లో విమానాల్లో ఎంత మంది ప్రయాణించారో తెలిస్తే అవాక్కవుతారు..!

ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య దేశీయ విమాన(Flight) ప్రయాణికుల సంఖ్య 69.79% పెరిగింది. ఈ నాలుగు నెలల్లో దేశీయ విమానాల్లో మొత్తం 3.57 కోట్ల మంది ప్రయాణికులు(passengers) ప్రయాణించారు...

Flight: ఆకాశవీధిలో భారీగా పెరిగిన ప్రయాణాలు.. నాలుగు నెలల్లో విమానాల్లో ఎంత మంది ప్రయాణించారో తెలిస్తే అవాక్కవుతారు..!
Flight Journey
Srinivas Chekkilla
|

Updated on: May 23, 2022 | 10:40 AM

Share

ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య దేశీయ విమాన(Flight) ప్రయాణికుల సంఖ్య 69.79% పెరిగింది. ఈ నాలుగు నెలల్లో దేశీయ విమానాల్లో మొత్తం 3.57 కోట్ల మంది ప్రయాణికులు(passengers) ప్రయాణించారు. ఒక్క ఏప్రిల్‌లోనే 1.09 కోట్ల మంది ప్రయాణించారు. గతేడాది ఏప్రిల్‌లో 57.25 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి అందిన సమాచారం ప్రకారం గతేడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో కేవలం 2.92 కోట్ల మంది మాత్రమే ప్రయాణించారు. ఈ నెల 21వ తేదీ వరకు 77,19,693 మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారు. ఏప్రిల్ 2022లో, ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్‌లోని విమానాశ్రయాలలో సమయానుకూల పనితీరులో AirAsia అగ్రగామిగా ఉంది. దాని సమయ పనితీరు 94.8శాతంగా ఉంది.

అదేవిధంగా విస్తారా 90.9 శాతం, ఇండిగో 90.1 శాతం, స్పైస్ జెట్ 89.2 శాతం, గో ఫస్ట్ 87.2 శాతం, ఎయిర్ ఇండియా 81.8 శాతం, అలయన్స్ ఎయిర్ 63% కలిగి ఉన్నాయి. అంతర్జాతీయంగా చూస్తే ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి 2022 మొదటి మూడు నెలల్లో 13.6 మిలియన్ల మంది ప్రయాణికులు ప్రయాణించారు. గత ఏడాది కంటే రెండింతలు ఎక్కువ. ఈ సంవత్సరం ప్రయాణికుల ట్రాఫిక్ ఇప్పటివరకు దుబాయ్ – భారతదేశం, దుబాయి- పాకిస్తాన్ ఎక్కువ ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి