Lokesh arrest: గుంటూరు: పరమయ్యగుంటలో ఉద్రిక్త పరిస్థితులు.. నారా లోకేశ్ అరెస్ట్

గుంటూరు  పరమయ్యగుంటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉన్మాది దాడిలో మృతి చెందిన రమ్య కుటుంబసభ్యులను లోకేశ్‌, టీడీపీ..

Lokesh arrest: గుంటూరు: పరమయ్యగుంటలో ఉద్రిక్త పరిస్థితులు.. నారా లోకేశ్ అరెస్ట్
Nara Lokesh
Follow us

|

Updated on: Aug 16, 2021 | 3:03 PM

గుంటూరు  పరమయ్యగుంటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉన్మాది దాడిలో మృతి చెందిన రమ్య కుటుంబసభ్యులను  లోకేశ్‌, టీడీపీ నేతలు పరామర్శించారు.  ఉద్రిక్త పరిస్థితుల మధ్య లోకేశ్‌ను అక్కడి నుంచి పోలీసులు పంపించివేశారు. ఈ క్రమంలో లోకేశ్ ప్రభుత్వంపై భగ్గుమన్నారు.  పరామర్శకు వస్తే ప్రభుత్వానికి ఉలుకెందుకని లోకేశ్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఆగడం లేదని లోకేశ్‌ మండిపడ్డారు. మరోవైపు లోకేశ్‌ కేవలం రాజకీయ లబ్ధి కోసమే వచ్చారని వైసీపీ శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేశాయి. పరమయ్యగుంటలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.  పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నినాదాలు చేశారు. ఉద్రిక్తల మధ్య లోకేశ్‌ను అరెస్టు చేసి ప్రత్తిపాడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  ప్రత్తిపాటి పల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, ధూళిపాళ్లను వేర్వేరు పీఎస్‌లకు తరలించారు.

పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై అరెస్టుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తే పోలీసుల దౌర్జన్యం ఏంటని ప్రశ్నించారు. హత్యకు గురైన దళిత విద్యార్ధిని రమ్యకు రూ. కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీతానగరం గ్యాంగ్ రేప్ నేరస్తుడు వెంకటరెడ్డిని పట్టుకోవండంలో జగన్ ప్రతాపం చూపించాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడే గుంటూరులో పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణ హత్యకు గురైన దళిత విధ్యార్దిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేతలు లోకేష్, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, దూళిపాళ్ల నరేంద్ర గార్లపై పోలీసుల దౌర్జ్యన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు, ప్రజాస్వామ్య విలువలకు గండికొట్టేదిగా ఉన్నదని చంద్రబాబు పేర్కొన్నారు.  పరామర్శకు వెళ్లిన నేతలపై అమానుషంగా వ్యవహరించడం సరికాదన్నారు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Suryapet: పనివాడితో అత్తను హత్య చేయించిన కోడలు.. ఎందుకో తెలిస్తే షాక్

 కల నెరవేరింది.. ప్రధాని మోడీతో కలిసి ఐస్ క్రీం తిన్న పీవీ సింధు