TDP-Janasena: సంక్షేమం, అభివృద్ధే అజెండాగా టీడీపీ-జనసేన మేనిఫెస్టో.. 11 అంశాలతో త్వరలోనే విడుదల..

TDP-Jana Sena joint manifesto: ఎన్నికలే టార్గెట్‌గా తెలుగుదేశం, జనసేన పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. ఈ మేరకు ఎన్టీఆర్ భవన్‌ వేదికగా తెలుగుదేశం - జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు సభ్యులతో ఈ కమిటీ భేటీ అయ్యింది. మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి ఉన్నారు. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్‌ హాజరయ్యారు. సంక్షేమంతో కూడిన అభివృద్ధే ప్రధాన అజెండాగా ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ చర్చించింది.

TDP-Janasena: సంక్షేమం, అభివృద్ధే అజెండాగా టీడీపీ-జనసేన మేనిఫెస్టో.. 11 అంశాలతో త్వరలోనే విడుదల..
Pawan Kalyan --Chandrababu
Follow us

|

Updated on: Nov 13, 2023 | 9:07 PM

TDP-Jana Sena joint manifesto: ఎన్నికలే టార్గెట్‌గా తెలుగుదేశం, జనసేన పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. ఈ మేరకు ఎన్టీఆర్ భవన్‌ వేదికగా తెలుగుదేశం – జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు సభ్యులతో ఈ కమిటీ భేటీ అయ్యింది. మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి ఉన్నారు. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్‌ హాజరయ్యారు. సంక్షేమంతో కూడిన అభివృద్ధే ప్రధాన అజెండాగా ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ చర్చించింది. నిరుద్యోగ యువతకు రూ. 10 లక్షల వరకూ రాయితీ.. ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు. అలాగే అమరావతే రాజధానిగా కొనసాగింపు, పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం, బీసీలకు రక్షణ చట్టం, రద్దు చేసిన సంక్షేమ పథకాలు పునఃపరిశీలన చేస్తామని మేనిఫెస్టో కమిటీ చెప్పింది. 11అంశాలతో టీడీపీ- జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టో రూపొందించామని.. 120 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని మేనిఫెస్టో కమిటీ ధీమా వ్యక్తంచేసింది.

టీడీపీ నుంచి ఆరు, జనసేన నుంచి ఐదు.. 11 అంశాలతో కూడిన మినీ మేనిఫెస్టో..

టీడీపీ, జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టోలో 11 అంశాలను చేర్చారు. ఉమ్మడి మేనిఫెస్టోలో టీడీపీ తరపున 6 అంశాలను ఇప్పటికే ఇచ్చాం.. జనసేన ప్రతిపాధించిన ఐదు అంశాలను చేర్చామని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. 11 అంశాలపై పీఏసీలో చర్చించి, వివిధ వర్గాల నుంచి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత.. చంద్రబాబు, పవన్‌ ఫొటోలతో మేనిఫెస్టో రిలీజ్‌ చేస్తామని యనమల రామకృష్ణుడు చెప్పారు. హండ్రెడ్ పర్సెంట్‌ ప్రాక్టికల్ మేనిఫెస్టో తయారవుతుందని తెలిపారు.

జనసేన నుంచి ఆరు అంశాలను ప్రతిపాధించినట్లు ఆపార్టీ నేత ముత్తా శశిధర్ చెప్పారు. సంపన్న ఆంధ్రప్రదేశ్‌, అమరావతే రాజధాని, ఉచిత ఇసుక- భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి, జనసేన సౌభాగ్య పదం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన, వ్యవసాయ భాగ్యపదం ద్వారా రైతులు, కౌలు రైతులకు మేలు చేయడం, మన ఆంధ్రప్రదేశ్‌-మన ఉద్యోగాలు లాంటి ఆరు అంశాలను ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలో ప్రతిపాధించించినట్లు జనసేన శశిధర్ చెప్పారు.

రాజమండ్రి వేదికగా ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలను టీడీడీ, జనసేన ప్రకటించాయి. సూపర్ సిక్స్ హామీలను ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్తుంది టీటీడీ క్యాడర్‌. వాటికి అదనంగా మరికొన్ని జోడించి కమిటీ తుది మేనిఫెస్టోను రూపొందించనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..