Chandrababu Naidu Arrest Updates: రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు తరలింపు.. టీడీపీ బంద్‌కు జనసేన మద్దతు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు చంద్రబాబు రిమాండ్ లో ఉండనున్నారు. చంద్రబాబు తరుపున, సీఐడీ తరుపున వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. సిట్ వాదనలతో ఏకభవించి.. చంద్రబాబుకు రిమాండ్ విధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని శనివారం అరెస్ట్ చేసిన అధికారులు రాత్రంతా విచారించిన తర్వాత

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు చంద్రబాబు రిమాండ్ లో ఉండనున్నారు. చంద్రబాబు తరుపున, సీఐడీ తరుపున వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. సిట్ వాదనలతో ఏకభవించి.. చంద్రబాబుకు రిమాండ్ విధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని శనివారం అరెస్ట్ చేసిన అధికారులు రాత్రంతా విచారించిన తర్వాత ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో చంద్రబాబుతో సహా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరును కూడా చేర్చింది. ఏయితే ఓపెన్ కోర్టులో వాదనలు వినాలని టీడీపీ లీగల్ టీమ్ విజ్ఞప్తి చేయగా.. దీనికి న్యాయముర్తి అంగీకరించారు. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా బృందం వాదనలు వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తన వాదనలు తానే వినిపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. తనను అక్రంగా అరెస్ట్ చేశారని, స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
LIVE NEWS & UPDATES
-
ఉమ్మడి ప.గో జిల్లాలోకి ఎంట్రి అయిన చంద్రబాబు కాన్వాయ్
చంద్రబాబును రాజమండ్రి సెంట్ర్ జైలుకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోకి చంద్రబాబు కాన్వాయ్ ఎంట్రి అయ్యింది. చంద్రబాబు నాన్వాయ్‌ని పంపిన తర్వాతే మిగితా వాహనాలను పంపిస్తున్నారు పోలీసులు.
-
నారా లోకేష్‌కు పవన్ కల్యాణ్ ఫోన్
నారా లోకేష్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోన్ చేశారు. జగన్ పాలనపై పోరాటం కొనసాగిద్దామని, ధైర్యంగా ఉండాలంటూ మాట్లాడారు.
-
-
భారీ ట్రాఫిక్ జామ్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నారా చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. చంద్రబాబు వెళ్లే రహదారుల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. టీడీపీ కార్యకర్తలు భారీగా వచ్చి చేరుతుండటంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద దాదాపు 40 నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోయాయి.
-
రేపు టీడీపీ బంద్‌కు బీజేపీ మద్దతు ఇవ్వలేదు- పురంధేశ్వరి
చంద్రబాబు నాయుడును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతో టీడీపీ నేతలు సోమవారం రాష్ట్రం బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే ఇందులో జనసేన మద్దతు ఇవ్వగా, బీజేపీ కూడా మద్దతు ఇచ్చినట్లు ఓ లేటర్ వైరల్ అవుతోంది. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి స్పందించారు. రేపు ఏపీ బంద్‌కు బీజేపీ మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఫేక్ లేటర్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
-
చంద్రబాబుకు ఈ కేసులో పదేళ్ళు శిక్ష పడుతుంది
చంద్రబాబు చేసిన అవినీతి పాలనపై అన్ని కేసులు పెడితే ఆయన జీవతకాలం జైల్లో ఉండాల్సి వస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. జ్యుడీషియల్ రిమాండ్ తరువాత పోలీసు రిమాండ్ ఉంటుంది… ఇంకా చాలా విషయాలు బయటపడతాయన్నారు. చంద్రబాబుతో పాటు రామోజీరావు కూడా దారుణాలకు, అకృత్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో సుప్రీంకోర్టుకు వెళ్ళి కొన్ని కేసుల నుంచి రామోజీరావు తప్పించుకున్నారన్నారు. ఉన్నతస్థాయి పదవిలో ఉంటూ ప్రజల సొమ్మును దోచుకుంటే కేసులు పెడితే రాజకీయ కక్ష ఎలా అవుతుందని ప్రశ్నించారు.
-
-
చంద్రబాబుకు రిమాండ్‌పై ఎంపీ విజయసాయిరెడ్డి కామెంట్స్
చంద్రబాబు రిమాండ్‌పై ఎంపీ విజయసాయిరెడ్డి కామెంట్స్ చేశారు. పక్కా ఆధారాలతో చంద్రబాబుపై కేసు పెట్టారని, ఈ కేసుతో పాటు చంద్రబాబుపై ప్రాసిక్యూటబుల్ కేసులు ఇంకా మరో ఆరేడు ఉన్నాయన్నారు. చట్టాన్ని తన చేతిలో ఆయుధంగా మలచుకుని, తన స్వార్ధంతో తప్పించుకుంటూ వచ్చాడని వ్యాఖ్యానించారు. వైసీపీ పరిపాలనలో జగన్ సీఎంగా ఉండగా ఇక అలాంటివి జరగవన్నారు.
-
ప్రత్యేక భద్రతతో చంద్రబాబు జైలుకు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్ విధించిన కోర్టు.. ప్రత్యేక భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకెళ్లారు.
-
చంద్రబాబుకు ఇంటి నుంచి భోజనంకు కోర్టు అనుమతి
రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబును తరలించారు.14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. అయితే జైలులో చంద్రబాబుకు ఇంటి నుంచి భోజనం, మందులు ఇచ్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
-
జైలులో ప్రత్యేక వసతి
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. జైలులో బాబుకు ప్రత్యేక వసతి కల్పించనున్నారు.
-
టీడీపీ బంద్ కు జనసేన మద్దతు..
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. టీడీపీ ఇచ్చిన బంద్ కు జనసేన పార్టీ మద్దతునిచ్చింది. ఈ మేరకు జనసేన ప్రకటన విడుదల చేసింది.
-
భారీ వర్షంలో రాజమండ్రికి..
చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అభివాదం చేస్తూ కారెక్కారు. భారీ వర్షంలో చంద్రబాబును రాజమండ్రికి తరలిస్తున్నారు.
-
సెంట్రల్ జైలుకు చంద్రబాబు తరలింపు..
చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో పోలీసులు ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. రాజమండ్రికి తరలిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ జైలు దగ్గరకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు.
-
ప్రజాస్వామ్యంలో ఇవి చీకటి రోజులు.. పవన్
ప్రజాస్వామ్యంలో ఇవి చీకటి రోజులన్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్. ఏపీలో ప్రజలు ఇక జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ నేపథ్యంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించేవారిపై కేసులు, దాడులు చేసే సంస్కృతి రాష్ట్రంలో నెలకొందని విమర్శించారు. బెయిల్ మీద ఉన్న వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయ్యారని, చట్టాలు సరిగ్గా పనిచేస్తే ముఖ్యమంత్రి అయ్యేవారా? అని ఆయన ప్రశ్నించారు. దేశంలో కీలకమైన జీ-20 జరుగుతున్నప్పుడు చంద్రబాబును అరెస్టు చేసి డైవర్ట్ చేశారన్నారు. వైసీపీ వాళ్లు యుద్ధం కోరుకుంటున్నారని, తాము కూడా అందుకు రెడీ అన్నారు పవన్‌కల్యాణ్.
-
విచారణ రేపటికి వాయిదా..?
చంద్రబాబు మళ్లీ వేసిన పిటిషన్లపై కోర్టు రేపటికి వాయిదా వేసింది.
-
పవన్ సినిమాలు తీసుకుంటే మంచిది..
చంద్రబాబు జైలుకు వెళ్లడంతో పవన్ ఇక రాజకీయాలు మానేసి సినిమాలు తీసుకుంటే మంచిదన్నారు ఏపీ మంత్రి అమర్నాథ్. కేంద్ర నిఘా వర్గాల సమాచారం అంటూ పవన్ చెబుతున్నవన్నీ సినిమాస్టోరీలే అన్నారు అమర్నాథ్.
-
లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారుః నందిగం సురేష్
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్‌పై వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ స్పందించారు. చంద్రబాబు ఒక్క కుమారుడు, ఒక్క మనవడి కోసం లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు సురేశ్. పవన్ కళ్యాణ్ తీరును కూడా తప్పుపట్టారాయన.
-
రేపు టీడీపీ బంద్..
స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అనంతరం.. ఏసీబీ కోర్టు 14 రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సోమవారం బంద్ కు పిలుపునిచ్చింది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ బంద్ కు పిలుపునిచ్చింది.
-
చంద్రబాబు తరుపున రెండు పిటీషన్లు దాఖలు..
జుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిన వెంటనే చంద్రబాబు తరపు న్యాయవాదులు న్యాయస్థానంలో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. జైలుకు తరలించకుండా ఆయనను గృహ నిర్బంధంలో ఉంచాలని లేదా కేంద్ర కారాగారానికి తరలించినట్టు అయితే అక్కడ ప్రత్యేక వసతి సౌకర్యం కల్పించాలని ఒక పిటిషన్, చంద్రబాబు ఆరోగ్య రీత్యా ఇంటి భోజనం, మందులు తీసుకునేందుకు అనుమతించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. మరో వైపు చంద్రబాబును విచారించేందుకు వారం పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీఐడీ కూడా పిటిషన్ దాఖలు చేసింది.
-
రోజా సంబరాలు..
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు తగిన శిక్ష పడిందన్నారు ఏపీ మంత్రి రోజా.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంపై రోజా హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలు స్వీట్లు పంచుకొని , టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.
-
లోకేశ్ ఇప్పుడు రాసుకోవాలి..
జగన్ అవినీతికి పాల్పడ్డాడని , రెడ్ డైరీలో వివరాలు ఉన్నాయంటున్న లోకేశ్ ఇప్పుడు తన తండ్రి అవినీతి గురించి ఆ డైరీలో రాసుకోవాలన్నారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబు అవినీతిని బయటపెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించిన ఘనత సీఎం జగన్‌దే అన్నారు. లోకే
-
ఏపీలో 144 సెక్షన్
చంద్రబాబుకు 22 వరకు రిమాండ్ విధించిన నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏపీలో 144 సెక్షన్ విధించారు.
-
జీవితాంతం చిప్పకూడు తింటారు..
చంద్రబాబు జీవితాంతం చిప్పకూడు తింటారని చెప్పారు వైసీపీ మంత్రి రోజా. చంద్రబాబుకు మద్దతుగా ఉన్న నేతలంతా జైలుకెళ్లే రోజు వస్తుందని జోస్యం చెప్పారామె. స్కిల్ స్కామ్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్ట్ చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగానే ఆమె తన అనుచరులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచారు. బాణాసంచా కాల్చారు.
-
రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు
36 గంటల తర్వాత వీడిన ఉత్కంఠ వీడింది. చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పును ప్రకటించింది. రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబును తరలించనున్నారు. బెయిల్ పిటిషిన్‌కు చంద్రబాబు తరపు లాయర్ లుథ్రా ప్రయత్నాలు చేసినప్పటికీ.. సీఐడీ వాదనలు బలంగా ఉండటంతో కోర్టు రిమాండ్ వైపు మొగ్గు చూపింది.
-
బాబుకు 14 రోజుల రిమాండ్
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈనెల 22 వరకు రిమాండ్ విధించింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. సిట్ ఆధారాలు పరిశీలించిన అనంతరం.. బాబుకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి.
-
చంద్రబాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. సిట్ వాదనలు ఏకీభవించిన న్యాయస్థానం.. ఈనెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. సోమవారం ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.
-
కోర్టు దగ్గర హైటెన్షన్..
విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గర హైటెన్షన్ వాతావారణం నెలకొంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో వాదనలు ముగిశాయి. ఉదయం 8 గంటల నుంచి సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఏ క్షణమైనా తీర్పు వెలువడే అవకాశం ఉంది. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
-
ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు..
ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు అన్నారు ఎంపీ కేశినేని నాని. దేశంలోనే మచ్చలేని నేతల్లో చంద్రబాబు ఒకరని చెప్పారు. స్కిల్ కేసులో అసలు పసలేదన్నారు. యువత బాగుపడాలనే ఒప్పందం జరిగిందని చెప్పారు. ఈ కేసుతో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. చంద్రబాబు క్లీన్‌గా బయటకువస్తారని చెప్పారు.
-
వాహనాలు సిద్ధం..
చంద్రబాబును కోర్టు రిమాండ్‌కు పంపితే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయవాడ – రాజమండ్రి రహదారిని ఆధీనంలోకి తీసుకున్నారు. చంద్రబాబును తరలించేందుకు వాహనాలు సిద్ధం చేశారు పోలీసులు.
-
పవన్ మద్దతు ఇవ్వడం విడ్డూరం..
చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాష్ట్ర ప్రజలు, టీడీపీ కార్యకర్తలంతా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తారని టీడీపీ అధినాయకత్వం భావించిందని, అయితే అలా జరగలేదన్నారు ఏపీ మంత్రి జోగి రమేశ్. చంద్రబాబుకు పవన్ మద్దతు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.
-
విజయవాడలో హైటెన్షన్
విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గర హైటెన్షన్ వాతావారణం కొనసాగుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముగిసిన వాదనలు ముగిశాయి. ఉదయం 8 గంటల నుంచి సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఏ క్షణమైనా తీర్పు వెలువడే అవకాశం ఉంది. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
-
ఏపీ వ్యాప్తంగా అలర్ట్
ఏసీబీ కోర్టు త్వరలో నిర్ణయం ప్రకటించనుండడంతో ఏపీవ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. రాజమండ్రిలో ముందుగానే 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
-
చంద్రబాబుపై 34 అభియోగాలు..
ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబే కుట్రకు ప్రధాన సూత్రదారి అని సీఐడీ ఏసీబీ కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించింది. మొత్తం 28పేజీలతో కూడిన చంద్రబాబు రిమాండ్ రిపోర్టును సమర్పించింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగిన తీరును సీఐడీ వివరించింది. చంద్రబాబు ఆదేశాలతోనే డబ్బు రిలీజ్ అయ్యిందని తెలిపింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడును ముద్దాయిగా చేర్చాలని సీఐడీ మెమో దాఖలు చేసింది. 34 అభియోగాలు సీఐడీ నమోదు చేసింది.
-
చంద్రబాబుకు ఏం కాదు..
చంద్రబాబుకు ఏం కాదని టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి అన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్టుగా ఉందని తెలిపారు. కడిగిన ముత్యంలా ఆయన బయటకు వస్తారని, పదవి ఉన్నా లేకున్నా చంద్రబాబు ప్రజల మనిషి అన్నారు.
-
సాయంత్రం ఐదు గంటలకు తీర్పు..!
స్కిల్ డవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిలా..? రిమాండ్ విధిస్తారా.. అనే విషయం ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో సీబీఐ కోర్టు ఏ క్షణంలోనైనా తీర్పును వెలువరించే అవకాశం ఉంది. సాయంత్రం ఐదు గంటలకు తీర్పు వెలువడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
-
ఏ క్షణమైనా తీర్పు..
స్కిల్ డవలప్మెంట్ స్కామ్ కేసులో న్యాయస్థానం తీర్పును జడ్జీ చదువుతున్నారు. ఏ క్షణమైనా జడ్జి తీర్పును వెలువరించే అవకాశముంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కాన్వాయ్ ను అధికారులు సిద్ధం చేశారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
-
కస్టడీకి ఇస్తారా? బెయిల్ ఇస్తారా?
చంద్రబాబు అరెస్టు విషయంలో సీఐడీ కోరినట్టు కస్టడీకి ఇస్తారా? రిమాండ్ రిపోర్టు తిరస్కరించి బెయిల్ ఇస్తారా? అన్నది మరికాసేపట్లో తేలనుంది. దీంతో సీబీఐ కోర్టు ప్రాంతంలో పోలీసులను భారీగా మోహరించారు..
-
కాసేపట్లో కోర్టు నిర్ణయం..
స్కిల్ డవలెప్మెంట్ స్కామ్ కేసులో.. చంద్రబాబు అరెస్టు అనంతరం ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. సీఐడీ తరుపున ఏఏజీ, చంద్రబాబు తరుపున లూథ్రా వాడీవేడీగా వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. చంద్రబాబుపై 34 అభియోగాలు నమోదు చేసిన నేపథ్యంలో.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
-
ముగిసిన వాదనలు..
స్కిల్ స్కామ్ కేసులో మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్టు అనంతరం.. ఆదివారం విజయవాడ ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా కొనసాగిన వాదనలు ముగిశాయి. దీంతో కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వాదనల అనంతరం.. అడ్వకేట్ లూథ్రా కోర్టు నుంచి బయటకు వెళ్లిపోయారు.
-
గవర్నర్ అనుమతి అవసరం లేదు
సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు కోసం గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు ఏఏజీ పేర్కొన్నారు. స్పీకర్‌కు సమాచారం ఇస్తే సరిపోతుందని.. అరెస్టుకు ముందు అన్ని నియమాలను పాటించినట్లు ఏఏజీ తెలిపారు.
-
ఐపీసీ సెక్షన్ 409పై చర్చ..
ఇక చంద్రబాబుపై నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 409పై చర్చ జరుగుతోంది. ఈ సెక్షన్‌లోనే చంద్రబాబుకు బెయిల్ వస్తుందా రాదా అనేది అనుమానంగా మరింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 ప్రకారం.. ప్రభుత్వ ఆస్తి కాపాడాల్సిన ప్రజా సేవకులు వారిని మోసం చేస్తే నేరం కింద ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఎవరైనా ఏదైనా పద్ధతిలో ఆస్తిని అప్పగిస్తే లేదా పబ్లిక్ సర్వెంట్ హోదాలో లేదా బ్యాంకర్, వ్యాపారి.. ఆస్తికి సంబంధించి నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడితే.. జీవిత ఖైదు విధించే ఛాన్స్ ఉంది. లేదంటే పదేళ్ల వరకు పొడిగించే వివరణతో కూడిన జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. శిక్షతోపాటు జరిమానా కూడా విధించవచ్చు.
-
భారీగా బలగాల మోహరింపు..
ఏసీబీ కోర్టు దగ్గర భారీగా బలగాలను మోహరించారు. సీబీఐ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ.. ఇవాళ ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
-
చట్ట ప్రకారమే పోలీసుల చర్యలు: ధర్మాన
చంద్రబాబు అరెస్ట్‌పై అంశంపై ఆంధ్రప్రదశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు. పోలీసులు చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగిందన్నారు. 2021లో దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదయ్యిందన్నారు.
-
6 గంటలుగా కొనసాగుతోన్న టెన్షన్..
చంద్రబాబుకు రిమాండ్ విధిస్తారా, తిరస్కరిస్తారా.? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆరు గంటలుగా ఏసీబీ కోర్టు లోపల, బయటా టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్‌పై కోర్టులో సుదీర్ఘ వాదనలు సాగుతున్నాయి. PC యాక్ట్ ప్రకారం 7 రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాలని, నోటీసులు ఇవ్వకుండా చంద్రబాబును అరెస్టు చేశారని ఆయన తరపు న్యాయవాది లూథ్రా అన్నారు. చంద్రబాబుపై నమోదైన అన్ని సెక్షన్లలో 409 సెక్షన్ మినహా మిగతావి 7 ఏళ్లలోపు శిక్ష పడేవే అన్నారు. 409 సెక్షన్ ఈ కేసులో చంద్రబాబుకు వర్తించదని ఆయన తెలిపారు.
-
తిరిగి మొదలైన వాదనలు..
రెండవ బ్రేక్ తర్వాత ఏసీబీ కోర్టులో వాదనలు తిరిగి మొదలయ్యాయి. ఇరుపక్షాల నుంచి 15 మంది మాత్రమే ఉండాలన్న జడ్జి. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలంటూ లూథ్రా వాదనలు వినిపించారు. ఇదిలా ఉంటే ఉదయం 6 గంటల నుంచి చంద్రబాబు ఏసీబీ కోర్టులోనే ఉన్నారు. కోర్టు నిర్ణయంపై ఏపీ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అరెస్టు సమయంలో సీఐడీ నిబంధనలు పాటించలేదని లూథ్రా తెలిపారు. వ్యక్తిని చుట్టుముట్టి కదలకుండా చేయడం హక్కుల ఉల్లంఘనే అన్న ఆయన దీన్ని అరెస్టుగానే పరిగణించాలన్నారు.
-
కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ..
ఏసీబీ కోర్టు ఏ తీర్పునిస్తుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బ్రేక్ సమయం ముగిసిన తర్వాత వాదనలు మళ్లీ ప్రారంభమయ్యాయి. బ్రేక్ టైమ్‌లో అడ్వొకేట్లతో చంద్రబాబు, లోకేష్ చర్చలు జరిపారు. మరో 2 గంటలు వాదనలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. 409 సెక్షన్, మరికొన్ని అంశాలపై వాడివేడి వాదనలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే బ్రేక్‌కు ముందు.. విరామానికి ముందు హోరాహోరీగా వాదనలు జరిగాయి. చంద్రబాబు పేరు ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు లేదని జడ్జి ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్ నమోదులో ఆలస్యానికి కారణాలు అడిగిన జడ్జి. చంద్రబాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్‌ను ఏఏజీ వివరించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండా ఎందుకు అరెస్ట్ చేశారని లూథ్రా ప్రశ్నించారు.
-
ముగిసిన చంద్రబాబు వాదనలు..
ఏసీబీ కోర్టులో చంద్రబాబు వాదనలు ముగిశాయి. తనను కక్షతో అరెస్ట్ చేశారన్న చంద్రబాబు, తన అరెస్ట్ ముమ్మాటికీ అక్రమమని తెలిపారు. కోర్టులో హోరాహోరీ వాదనలు జరుగుతున్నాయి. రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలని సిద్ధార్థ లూథ్రా నివేధించారు. మరో రెండు గంటలు వాదనలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
Published On - Sep 10,2023 10:28 AM




