Chandrababu: ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ.. సరైన సమాచారం లేక బీసీలకు అన్యాయం జరుగుతోదంటూ..

ప్రధాని నరేంద్రమోదీకి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ ఒక లేఖ రాశారు. బీసీ జనగణన చేపట్టాలని లేఖలో ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Chandrababu: ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ.. సరైన సమాచారం లేక బీసీలకు అన్యాయం జరుగుతోదంటూ..
Chandrababu
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 19, 2021 | 2:02 PM

Chandrababu Letter – PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోదీకి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ ఒక లేఖ రాశారు. బీసీ జనగణన చేపట్టాలని లేఖలో ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సరైన సమాచారం లేక బీసీలకు అన్యాయం జరుగుతోందని తన లేఖలో సవివరంగా ప్రధానికి వివరించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా బీసీలు అన్ని రకాలుగా వెనకబడే ఉంటున్నారని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. బీసీ జన గణన పక్కాగా జరిగి తేనే బీసీలకు సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన లేఖలో వివరించే ప్రయత్నం చేశారు.

కాగా, తమ ప్రభుత్వ హయాంలోనే బీసీ జన గణన చేపట్టాలని అసెంబ్లీలో ఏకగ్రీన తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామని గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు. కులాల వారీగా అందు బాటు లో ఉన్న జనగణన వివరాలు 90 ఏళ్ల క్రితానివి.. అది ఇప్పుడు పనికి రాదని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తి పై ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే స్పందించాలని చంద్రబాబు కోరారు. తమ విజ్ఞప్తి పై ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే స్పందించాలని కోరారు చంద్రబాబు.

ఇదిలాఉండగా, మాజీ మంత్రి ఆనందబాబుకి పోలీసులు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ మండిపడింది. ఏపీలో గంజాయి సాగుపై అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి ఆనంద్ బాబు.. చెబితే నోటీసులిస్తారా అంటూ.. తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లపై దాడులు నిర్వహిస్తున్న ఇతర రాష్ట్రాల పోలీసులకు నోటీసులు ఇచ్చే దమ్ము ప్రభుత్వానికి, పోలీసులకు ఉందా అని ఆపార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరాం ప్రశ్నించారు.

Read also: Accident: టైర్ పేలి బైక్ పై వెళ్తున్న నలుగురు యువకులపైకి దూసుకెళ్లిన కారు..