Chandrababu: సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. పవన్‌కు..
AP Assembly Election Result: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సునామీ సృష్టిస్తోంది. భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. తూర్పు గోదావరి, కృష్ణా, విజయనగరం, చిత్తూరు జిల్లాలను కూటమి స్వీప్ చేసేలా కనిపిస్తుంది. దీంతో కౌంటింగ్ కేంద్రాల నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థులు వెనుదిరుగుతున్నారు. మరోవైపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది.

ఏపీలో కూటమి విజయం ఖాయమైంది. ఇప్పుడున్న ట్రెండ్స్‌ని బట్టి చూస్తే.. 150 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. సీఎం జగన్ తప్ప మిగతా మంత్రులంతా వెనుకంజలో ఉన్నారు. పలు జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ అదే జోరు కనబరుస్తోంది. మొత్తం 25కు గానూ.. 22 చోట్ల కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఓటమి బాధలో వైసీపీ ఉండగా.. తెలుగు దేశం పార్టీ చరిత్రలో అతిపెద్ద విజయం దిశగా పయనిస్తోంది. దీంతో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి.. ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9 న ముఖ్యమంత్రిగా చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రి వర్గంలో మిత్ర పక్షం నుంచి ఎవర్ని కేబినెట్‌లోకి తీసుకుంటారు. పవన్ కల్యాణ్‌కు ఏ పదవి ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది .
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
