Watch Video: శ్రీవారి దర్శనం క్యూలైన్లో ప్రాంక్పై.. తమిళ యూట్యూబర్ క్షమాపణలు..
తామూ శ్రీవారి భక్తులమే, భక్తులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాం అంటూ వీడియో విడుదల చేశారు తమిళనాడుకు చెందిన యూట్యూబర్స్. గత వారం తిరుమల శ్రీవారి దర్శనానికి స్నేహితులతో కలిసి వచ్చిన తమిళ యూట్యూబ్ వాసన్ చేసిన ఫ్రాంక్ వీడియో కలకలం రేపింది. దీనిపై టీటీడీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. తమిళ యూట్యూబర్ వాసన్పై చర్యలకు సిద్ధమైంది. ప్రత్యేక విజిలెన్స్ సైబర్ వింగ్ టీంను తమిళనాడుకు పంపింది.

తామూ శ్రీవారి భక్తులమే, భక్తులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాం అంటూ వీడియో విడుదల చేశారు తమిళనాడుకు చెందిన యూట్యూబర్స్. గత వారం తిరుమల శ్రీవారి దర్శనానికి స్నేహితులతో కలిసి వచ్చిన తమిళ యూట్యూబ్ వాసన్ చేసిన ఫ్రాంక్ వీడియో కలకలం రేపింది. దీనిపై టీటీడీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. తమిళ యూట్యూబర్ వాసన్పై చర్యలకు సిద్ధమైంది. ప్రత్యేక విజిలెన్స్ సైబర్ వింగ్ టీంను తమిళనాడుకు పంపింది. దీనిపై తమిళ యూట్యూబర్ టీటీఎస్ వాసన్ స్పందించారు. తాము భక్తుల మనోభావాలు దెబ్బతీసి ఉంటే క్షమాపణలు చెబుతున్నామంటూ వీడియో విడుదల చేశారు. శ్రీవారి భక్తుల ఇబ్బందులను చెప్పాలన్న ఉద్దేశంతోనే వీడియో చేస్తుండగా తోటి స్నేహితుల చర్యలు కొందరి మనోభావాలు దెబ్బతీశాయనీ సెల్ఫీ వీడియోలో వాసన్ పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి వీడియోలను తీయకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చేసిన తప్పును తెలుసుకుంటూ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు వాసన్.
శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల క్యూ లైన్లో ఫ్రాంక్ వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన తమిళ యూట్యూబర్ వాసన్ వ్యవహారం 3 రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఫ్రాంక్ వీడియోలు తీయడం హేయమైన చర్యగా టిటిడి అభిప్రాయ పడింది. ఆకతాయిలు చేసిన వికృత చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. ఈ లోపు శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెబుతూ మరో వీడియో విడుదల చేసారు టిటిఎస్ వాసన్. ఇప్పుడు టీటీడీ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
