AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: నిర్మానుష్య లేఅవుట్‌లో సగం కాలిన ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా గుండె గుభేల్

విశాఖ కాపులుప్పాడలో సగం కాలిన మృతదేహం కలకలం రేపింది. లే అవుట్‌లో సగం కాలిన శరీర భాగాలు, ఎముకలు గుర్తించారు పోలీసులు. హత్య చేసి పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో పూసలు, ఒక ఫోటో లభ్యమయ్యాయి. ఆనందపురం పిఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైన..

Vizag: నిర్మానుష్య లేఅవుట్‌లో సగం కాలిన ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా గుండె గుభేల్
Representative Image
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Feb 19, 2025 | 10:01 PM

Share

విశాఖ కాపులుప్పాడలో సగం కాలిన మృతదేహం కలకలం రేపింది. లే అవుట్‌లో సగం కాలిన శరీర భాగాలు, ఎముకలు గుర్తించారు పోలీసులు. హత్య చేసి పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో పూసలు, ఒక ఫోటో లభ్యమయ్యాయి. ఆనందపురం పిఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైన.. పెందుర్తికి చెందిన జ్యోతిష్కుడు మోతు అప్పన్నతో సరిపోతున్నాయి ఆనవాళ్లు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోనే కాపులుప్పాడలో లేఅవుట్ ఉంది. చుట్టూ ఆరడుగుల ప్రహరీ. అందులో మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వెరిఫై చేసేసరికి.. పుర్రె, సగం కాలిన శరీర భాగాలు కనిపించాయి. అక్కడే కొన్ని పూసలు ఒక ఫోటో కూడా పోలీసులకు లభ్యమైంది. క్లూస్ టీం రంగంలోకి దింపిన పోలీసులు.. అణువణువూ గాలించి ఆధారాలను సేకరించారు.

అతనిదేనా..!

అయితే మృతదేహం పెందుర్తికి చెందిన జ్యోతిష్కుడు మోతు అప్పన్నతో సరిపోలుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మోతు అప్పన్న మిస్సింగ్‌పై అనందపురం పిఎస్‌లో కేసు నమోదయింది. ఇంటింటికి వెళ్లి అప్పన్న జ్యోతిష్యం చెబుతూ ఉంటాడు. 9వ తేదీ నుంచి మిస్ అయినట్టు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుకు, మృతదేహంకు సంబంధం ఉందా అనేదానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. సగం కాలినట్టు ఉన్న మృతదేహం వెనుక కారణమేంటి..? కారకులు ఎవరు గుర్తించే పనిలో ఉన్నామన్నారు ఏసిపి అప్పలరాజు.

అనుమానాలు..

అప్పన్న కుటుంబ సభ్యులను కూడా పిలిపించారు పోలీసులు. మృతదేహం అప్పన్నతో సరిపోలుతుందని కుటుంబ సభ్యులు అంటున్నారు. మృతదేహం తన తండ్రిదే అని అంటున్నాడు కొడుకు దుర్గాప్రసాద్. కొందరిపై అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించారు పోలీసులు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక.. ప్రొసీజర్ ప్రకారం మృతదేహాన్ని గుర్తిస్తారు పోలీసులు. అవసరమైతే మృతదేహాన్ని గుర్తించేందుకు డిఎన్ఏ పరీక్షలకు కూడా పంపుతారు. అయితే ఆ మృతదేహం జ్యోతిష్కుడు అప్పన్నదే అని ప్రాథమికంగా నిర్ధారణ కుటుంబ సభ్యులు చేసినప్పటికీ.. అతనిని హత్య ఎందుకు చేయాల్సి వస్తుందని దానిపై ఇప్పుడు మిస్టరీగా మారింది. చూడాలి మరి ఆ మృతదేహం అప్పన్నదేనా..? లేక ఇంకెవరిదా..? అంత దారుణంగా హత్య ఎవరు చేశారు..? కారణమేంటి..? పోలీసుల విచారణలో తెలల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!