Andhra Pradesh: సైకో సురేష్‌ పాపం పండింది.. గడ్డి వాములో డీకంపోజ్‌ స్థితిలో మృతదేహం లభ్యం..

9వ తరగతి అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించి ఆమెను చంపేసిన సైకో సురేష్‌ పాపం పండింది.. అనకాపల్లిలో ప్రేమోన్మాది సురేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో సురేష్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.. గ్రామ సమీపంలోని గడ్డి తోటలో మృతదేహం కనిపించింది.

Andhra Pradesh: సైకో సురేష్‌ పాపం పండింది.. గడ్డి వాములో డీకంపోజ్‌ స్థితిలో మృతదేహం లభ్యం..
Crime News
Follow us

|

Updated on: Jul 11, 2024 | 12:46 PM

9వ తరగతి అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించి ఆమెను చంపేసిన సైకో సురేష్‌ పాపం పండింది.. అనకాపల్లిలో ప్రేమోన్మాది సురేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో సురేష్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.. గ్రామ సమీపంలోని గడ్డి తోటలో మృతదేహం కనిపించింది. బ్లాక్‌కలర్‌ టీషర్ట్‌, ట్రాక్‌ ప్యాంట్‌తో ఉన్న డెడ్‌బాడీని గుర్తించి స్థానికులు పోలీసులకు చెప్పారు.. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని సురేష్ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహం సురేష్ దిగా గుర్తించారు. అనంతరం కొప్పుగుండుపాలెం సమీపంలోని గడ్డి తోటలోనే అధికారులు మృతదేహానికి పంచనామా చేస్తున్నారు.. విషంతాగి ఆత్మహత్య చేసుకున్నట్టు స్పాట్‌లో ఆధారాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. డీకంపోజ్‌ స్థితిలో సురేష్‌ మృతదేహం ఉందని .. వాసన వస్తున్నట్లు తెలిపారు.

శనివారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను హత్య చేసి పారిపోయిన సురేష్ చివరికి ఇలా సూసైడ్ చేసుకున్నాడు. ఇతని ఆచూకి చెప్పినవాళ్లకు 50 వేలు రివార్డును కూడా పోలీసులు ప్రకటించారు. చివరికి సురేష్‌ సుసైడ్‌ చేసుకోవడం సంచలనంగా మారింది. హత్య చేసిన తర్వాత నిందితుడు అదే డ్రెస్ లో పారిపోయినట్టు రెండు రోజుల క్రితం పోలీసులు ప్రకటించడంతో స్థానికులు అతనేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

జరిగింది ఇదే..

తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక (13).. రాంబిల్లి మండలం కొప్పు గుండు పాలెంలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటుంది. అనకాపల్లి జిల్లా కసింకోట సురేష్ అమ్మమ్మ గ్రామానికి వస్తూ బాలిక పై కన్నెశాడు.. ఈ క్రమంలో వేధింపులు ఎక్కువ కావడంతో కుటుంబసభ్యులు సురేష్ పై ఫిర్యాదు చేశారు. అనంతరం జైలుకెళ్లిన సురేష్ .. బెయిల్ పై బయటకు వచ్చి బాలికను హత్య చేసాడు.. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లిపోగా.. శనివారం స్కూల్ నుంచి వచ్చిన బాలిక.. నానమ్మ ఇంటికి వెళ్లి అక్కడ తాళాలు తీసుకుని… తన ఇంటికి వెళ్ళింది. కాసేపటికి నానమ్మ కాంతం కూడా మనమరాలు వెళ్లిన ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో ఇంటి తలుపులు వేసి ఉండడాన్ని గమనించి.. తలుపు తట్టింది. ఎంతకీ తీయకపోయేసరికి… కాస్త గట్టిగా అరిచింది. దీంతో తలుపులు తీసిన నిండితుడు సురేష్.. బాలిక నాన్నమ్మ కాంతంను తోసి పారిపోయాడు. లోపలకు వెళ్లి చూసేసరికి ఆ రక్తపు మడుగులో పడి ఉంది ఆ బాలిక. ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. గత కొంతకాలంగా వెంటపడుతున్న సురేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. రివార్డు కూడా ప్రకటించారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హైదరాబాదీలకు ఇంట్లో భోజనం కన్నా.. పొరుగు హోటల్ బిర్యానీయే మిన్న!
హైదరాబాదీలకు ఇంట్లో భోజనం కన్నా.. పొరుగు హోటల్ బిర్యానీయే మిన్న!
రాజ్ తరుణ్, లావణ్య వ్యవహరంపై మిర్చి మాధవి కామెంట్స్..
రాజ్ తరుణ్, లావణ్య వ్యవహరంపై మిర్చి మాధవి కామెంట్స్..
రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. లంగ్ క్యాన్సర్‌ కావొచ్చు..
శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. లంగ్ క్యాన్సర్‌ కావొచ్చు..
ర‌ష్యాలో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన భారత్ విమానం.. అదే కారణమా.?
ర‌ష్యాలో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన భారత్ విమానం.. అదే కారణమా.?
సగం ఆడ, సగం మగ.. రెండు లక్షణాలున్న అరుదైన పక్షి..! వందేళ్ల తరువాత
సగం ఆడ, సగం మగ.. రెండు లక్షణాలున్న అరుదైన పక్షి..! వందేళ్ల తరువాత
ముంబైకి బిగ్ షాక్.. ఐపీఎల్ 2025లో ఆ జట్టు సారథిగా సూర్య
ముంబైకి బిగ్ షాక్.. ఐపీఎల్ 2025లో ఆ జట్టు సారథిగా సూర్య
రేసు నుంచి జో బైడెన్ ఔట్! అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా కమలా హారిస్?
రేసు నుంచి జో బైడెన్ ఔట్! అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా కమలా హారిస్?
వీళ్లసలు మనుషులేనా.. బతికుండగానే ఇద్దరు మహిళలను సజీవంగా..
వీళ్లసలు మనుషులేనా.. బతికుండగానే ఇద్దరు మహిళలను సజీవంగా..
తండ్రి పేరు చెప్పకు ఆఫర్స్ ఇవ్వరంటూ సలహాలు.. కానీ..
తండ్రి పేరు చెప్పకు ఆఫర్స్ ఇవ్వరంటూ సలహాలు.. కానీ..
రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
ర‌ష్యాలో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన భారత్ విమానం.. అదే కారణమా.?
ర‌ష్యాలో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన భారత్ విమానం.. అదే కారణమా.?
రేసు నుంచి జో బైడెన్ ఔట్! అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా కమలా హారిస్?
రేసు నుంచి జో బైడెన్ ఔట్! అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా కమలా హారిస్?
జక్కన్నను కలవరపెడుతున్నకల్కి| వివాదంలో కల్కీ. ప్రభాస్ కు నోటీసులు
జక్కన్నను కలవరపెడుతున్నకల్కి| వివాదంలో కల్కీ. ప్రభాస్ కు నోటీసులు
బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!
మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!
మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?