గ్రహణం ఎఫెక్ట్‌..నిటారుగా నిలబడ్డ రోకలి !

రోకలి.. మనందరికీ తెలసిందే..సాధారణంగా గ్రామాల నేపథ్యం ఉన్న ప్రతిఒక్కరికీ రోకలి సుపరిచితమే. రోటిపచ్చడి చేయాలంటే..రోకలి తప్పనిసరి. అయితే ఆ రోకలి నిటారుగా నిలబడటం మీరు ఎప్పుడైనా చూశారా..? అదేంటని ఆశ్చర్యపోకండి..రోకలి ఎవరూ పట్టుకోకపోయినా నిట్టనిలువుగా నిలబడుతుంది..అదంతా గ్రహణం ఎఫెక్ట్‌ అంటున్నారు అక్కడి స్థానికులు..వివరాల్లోకి వెళితే.. సూర్యగ్రహణం సమయంలో దేశంలోని పలు ప్రాంతాల్లో వింత ఆచారాలు, పోకడలు, మూఢ నమ్మకాలు కనిపించాయి. గ్రహణం సమయంలో అరిష్టం జరక్కుండా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లెడు చెట్టుకి తాయొత్తులు కట్టారు. […]

గ్రహణం ఎఫెక్ట్‌..నిటారుగా నిలబడ్డ రోకలి !
Follow us
Anil kumar poka

|

Updated on: Dec 26, 2019 | 6:58 PM

రోకలి.. మనందరికీ తెలసిందే..సాధారణంగా గ్రామాల నేపథ్యం ఉన్న ప్రతిఒక్కరికీ రోకలి సుపరిచితమే. రోటిపచ్చడి చేయాలంటే..రోకలి తప్పనిసరి. అయితే ఆ రోకలి నిటారుగా నిలబడటం మీరు ఎప్పుడైనా చూశారా..? అదేంటని ఆశ్చర్యపోకండి..రోకలి ఎవరూ పట్టుకోకపోయినా నిట్టనిలువుగా నిలబడుతుంది..అదంతా గ్రహణం ఎఫెక్ట్‌ అంటున్నారు అక్కడి స్థానికులు..వివరాల్లోకి వెళితే..

సూర్యగ్రహణం సమయంలో దేశంలోని పలు ప్రాంతాల్లో వింత ఆచారాలు, పోకడలు, మూఢ నమ్మకాలు కనిపించాయి. గ్రహణం సమయంలో అరిష్టం జరక్కుండా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లెడు చెట్టుకి తాయొత్తులు కట్టారు. మరోవైపు సూర్యగ్రహణం సందర్భంగా రోకలి బండను నిటారుగా నిలబెట్టి కొన్ని ప్రాంతాల్లో పూజలు చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని గౌడ కాలనీలో బండి కొమురయ్య ఇంటి వద్ద సూర్యగ్రహణానికి తాంబాలంలో నీళ్లు పోసి రోకలి బండ నిలబెట్టారు. ఈ వింతను చూడటానికి జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు.

శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కె.కొత్తవలస గ్రామస్తులు ఇలా ప్రత్యేక పూజలు చేశారు. ఇక బాపట్ల లోని చాపల సంజీవరావు గృహం లో సూర్య గ్రహణం పట్టు విడుపులను రోలు లో రోకలి తో పరీక్షించారు.  చీపురుపల్లి మండలం పెదనడిపల్లి గ్రామంలో రోకలిని నిట్టనిలువుగా నిలిపి గ్రహణాన్ని చూశారు.  ఉభయ తెలుగు రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాలలో పలువురు రోలు రోకలి పద్దతిలోనే సూర్యగ్రహణాన్ని వీక్షించారు..

ఇక సాధారణంగా గ్రహణాన్ని సోలార్‌ ఫిల్టర్లతో చూస్తారు. కానీ, రంగారెడ్డి జిల్లా వెలిమినేడు, మేడిపల్లిలో తాంబాలంలో నీళ్లు పోసి, రోకలిని నిలబెట్టి సూర్యగ్రహణం చూశారు. నిలబెట్టిన రోకలి కింద పడితే సూర్యగ్రహణం ముగిసినట్లుగా వారు భావిస్తారు. తమ పూర్వీకులు గ్రహణ పట్టు విడుపులు ఇలాగే తెలుసుకునే వాళ్లని గ్రామస్తులు చెబుతున్నారు. నేటికీ ఇదే సంప్రదాయం కొనసాగిస్తున్నామని వివరించారు.

మొత్తానికి పదేళ్ల తర్వాత ఈ సంవత్సరం గురువారం పూర్తిస్థాయి సూర్య గ్రహణం ఏర్పడింది. ఇప్పటికే నాలుగు గ్రహణాలు సంభవించాయి. అందులో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు. అయితే ఈ రోజు ఉదయం 7.59 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమైంది. ఉ.9.04 గంటలకి గ్రహణం సంపూర్ణ స్థితికి చేరుకుంది. ఉ.10.47 గంటలకు గ్రహణం ముగిసింది..చెన్నై, అహ్మాదా బాద్, కొచ్చి, భువనేశ్వర్ లో  సూర్యగ్రహణం సంపూర్ణంగా కనిపించింది.. మళ్లీ ఈ స్థాయిలో సూర్యగ్రహణం కనిపించాలంటే 2031 వరకూ వేచి చూడాల్సిందే..