YogaAndhra-2025: యోగాంధ్రపై తెనాలిలో వినూత్న కార్యక్రమం.. అదరగొట్టిన విద్యార్ధులు!
ఈ నెల 21న అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పా్ట్లను పూర్తి చేసింది. ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం గత నెల రోజుల నుండి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే గురువారం తెనాలిలో 500 మంది విద్యార్థులతో ‘యోగాంధ్ర-2025’ ఆకృతి ప్రదర్శంచారు. ఇప్పుడు ఈ ప్రదర్శన ప్రతిఒక్కరిని అకట్టుకుంటోంది.

ఈ నెల 21న అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు ఏపిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖ వేదికగా ప్రధాని హాజరయ్యే కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యోగాలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల ఉత్సాహవంతులు సిద్దమవుతున్నారు. రికార్డులు బద్దలయ్యేలా యోగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా గత నెల రోజుల నుండి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుంది. ప్రతి జిల్లాలో కలెక్టర్, ఎస్పీతో పాటు ముఖ్యమైన అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
అయితే ఇందులో భాగంగా తెనాలిలో నిర్వహించిన కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా సాగింది. వివిధ రంగుల దుస్తులు ధరించిన విద్యార్ధిని విద్యార్ధులు యోగాంధ్ర అక్షరాల రూపంలో కూర్చోని చూపరులను ఆకట్టుకున్నారు. పట్టణంలోని మున్సిఫల్ కార్యాయలం ఎదుట జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు. యోగాతో అనేక ఉపయోగాలు ఉన్నాయని, ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ గంట పాటు యోగాసనాలు వేయాలన్న సందేశాన్ని తెలియజేశారు.
వీడియో చూడండి..
మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రోత్సాహంతో మున్సిఫల్ ఛైర్ పర్సన్ తాడిబోయిన రాధిక కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో తెనాలి ప్రాంత వాసులు తమ వంతుగా వినూత్న కార్యక్రమాలు చేయడం ఎప్పటి నుండో జరుగుతుందని.. ఈసారి కూడా యోగాంధ్ర ఆక్రుతిలో విద్యార్ధులు వేసిన ఆసనాలు ఆకట్టుకున్నాయని ఛైర్ పర్సన్ రాధిక తెలిపారు. 21న జరగనున్న యోగాంధ్ర కార్యక్రమంలో తెనాలి ప్రాంత నుండి పెద్ద సంఖ్యలో ఉత్సాహావంతులు పాల్గొంటారని ఆమో తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




