CM Chandrababu: గొడవలు వద్దు, ఇచ్చి పుచ్చుకుందాం.. బనకచర్లపై సీఎం చంద్రబాబు మరోసారి క్లారిటీ!
బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై రాజకీయం వేడెక్కితున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు దాన్ని చల్లార్చే ప్రయత్నం చేసారు. ఒకవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, జలవివాదాన్ని ట్రైబ్యునల్, న్యాయస్థానాలకే వెళ్లి తేల్చుకుంటామనే సంకేతాలు ఇస్తుండగా మరోవైపు చంద్రబాబు "నీటి విషయంలో తానెప్పుడూ గొడవకే వెళ్ళలేదని..అభివృద్ధే తన ధ్యేయమని శాంతియుతంగా స్పందించారు.

బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ, తెలంగాణల మధ్య రాజకీయం వేడెక్కితున్న వేళ.. ఏపీ సీఎం చంద్రబాబు లక వ్యాఖ్యలు చేశారు. గొడవలు పడకుండా గోదావరి జలాలను రెండు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరిలో నీరు పుష్కలంగా ఉన్నాయని.. ఆ నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు వాడుకోవచ్చన్నారు. “పోలవరం తప్ప గోదావరి నదిపై మిగిలిన ప్రాజెక్టులన్నీ అనుమతులు లేకుండా నిర్మించిన ప్రాజెక్టులేనని సీఎం చంద్రబాబు అన్నారు. తెలంగాణ ఒక బేసిన్‌కు నీళ్లు తీసుకెళ్తే, ఆంధ్రప్రదేశ్ మరో బేసిన్‌కు తీసుకెళ్తోందనీ, ఇందులో ఎవరికీ నష్టం లేదని చంద్రబాబు అన్నారు. కృష్ణానదిలో నీరు తక్కువగా ఉండటంతో, ట్రిబ్యునల్ నిర్ణయానికి అనుగుణంగా మేము ముందుకు వెళ్తున్నాం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
అదే సమయంలో చంద్రబాబు తన గత పాలనను గుర్తు చేస్తూ, “కంబైన్డ్ ఏపీలో దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టులు తానే నిర్మించానని.. అలాగే ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా తను ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు అన్నారు. అలాంటప్పుడు సముద్రంలో కలిసే నీటిని వాడుకోవడంపై అభ్యంతరాలు ఎందుకు అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య గల నీటి వివాదాలను కేవలం రాజకీయంగా కాక, ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అభివృద్ధి కోణంలో చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తెలంగాణతో తాను ఎప్పుడూ గొడవపడి ప్రజలను మభ్యపెట్టలేదని?” రాజకీయాల కోసం ఇస్టారీతిన వ్యవహరించడం సరికాదని పరోక్షంగా హెచ్చరించారు.
మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ ప్రాజెక్టును GWDT నిర్ణయాలను ఉల్లంఘించే ప్రణాళికగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ ఒత్తిడి తెస్తే, అవసరమైతే న్యాయపరంగా పోరాటం చేస్తాం” అంటూ మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణ వాటాలో నష్టం జరగకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




