మధ్యప్రదేశ్ నుంచి తీర్థ యాత్రలకు బయలుదేరారు.. సింహాచలం వస్తుండగా అర్థరాత్రి ఊహించని ప్రమాదం..
శ్రీకాకుళం జిల్లాలో తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్ళపాడు వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని వెనుక నుంచి తుఫాన్ వాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. వాహన డ్రైవర్ సునీల్ సింగ్ పటేల్(38) సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

శ్రీకాకుళం జిల్లాలో తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్ళపాడు వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని వెనుక నుంచి తుఫాన్ వాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తుఫాన్ వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. వాహన డ్రైవర్ సునీల్ సింగ్ పటేల్(38) సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం నరసన్నపేట సామాజిక ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్, ఖండ్వా జిల్లాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతులు మధ్యప్రదేశ్ లోని ఖండ్వా జిల్లాకి చెందిన విజయ్ సింగ్ తోమర్(65),ఖసియాల్ సింగ్(65).. ఖర్గోన్ జిల్లాకి చెందిన బోరోసింగ్ పవార్(60), సంతోషి భాయ్(60)లుగా గుర్తించారు.
బాధితులంతా మధ్యప్రదేశ్ నుంచి తీర్థ యాత్రలకు బయలు దేరారు. ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామిని దర్శించుకొని ఆంధ్రప్రదేశ్ లోని సింహాచలం, శ్రీశైలం పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు శనివారం రాత్రి పూరి నుంచి బయలుదేరగా ఆదివారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం ప్రమాదానికి గురయింది. ప్రమాద ఘటనపై కోటబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేశారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కోటబొమ్మాళి CHC కి తరలించారు.ఘటన స్థలాన్ని జిల్లా SP మహేశ్వర రెడ్డి పరిశీలించారు. ప్రమాద సమయంలో డ్రైవర్ వాహనాన్ని స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నట్లు ప్రాధమికంగా తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడా లేక పొగమంచు, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలోను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
