Pulsus organization: ఈ ప్రాంత అభివృద్దే తమ లక్ష్యం.. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం..
'వాణిజ్యం, ఉపాధే' లక్ష్యంగా ఉత్తరాంధ్ర రైతులతో పల్సస్ సంస్థ అధినేత గేదెల శ్రీనుబాబు సమావేశమయ్యారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర రైతులతో చర్చించారు. నీటి వినియోగాన్ని పెంచటం ద్వారా ఉత్తరాంధ్ర సాగు విస్తీర్ణాన్ని 12 లక్షల ఎకరాల నుండి 30 లక్షల ఎకరాలకు పెంచవచ్చన్నారు. వ్యవసాయ రంగంలో 'వాణిజ్యం, ఉపాధే' లక్ష్యంగా సరికొత్త చర్చకు ఉత్తరాంధ్ర వేదికైంది.

‘వాణిజ్యం, ఉపాధే’ లక్ష్యంగా ఉత్తరాంధ్ర రైతులతో పల్సస్ సంస్థ అధినేత గేదెల శ్రీనుబాబు సమావేశమయ్యారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర రైతులతో చర్చించారు. నీటి వినియోగాన్ని పెంచటం ద్వారా ఉత్తరాంధ్ర సాగు విస్తీర్ణాన్ని 12 లక్షల ఎకరాల నుండి 30 లక్షల ఎకరాలకు పెంచవచ్చన్నారు. వ్యవసాయ రంగంలో ‘వాణిజ్యం, ఉపాధే’ లక్ష్యంగా సరికొత్త చర్చకు ఉత్తరాంధ్ర వేదికైంది. ప్రస్తుతం ఉన్న 25 టీఎంసీల నుంచి 80 టీఎంసీల నీటి వనరుల వినియోగాన్ని పెంపొందించడమే తమ లక్ష్యం అన్నారు. రైతులు వాణిజ్య పంటల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో సుమారు 30 లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే, కేవలం 12 లక్షల ఎకరాలు మాత్రమే సాగులో ఉందన్నారు. నీటి కొరత కారణంగా 18 లక్షల ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయని పేర్కొన్నారు. సమృద్ధిగా నీటి వనరులు ఉన్నప్పటికీ, కాలువలు లేకపోవడం వల్ల 200 టీఎంసీల నీటిని వినియోగించుకోవల్సిన వాళ్లు కేవలం 25 టీఎంసీల నీటికి పరిమితమయ్యారని తెలిపారు.
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా వ్యవసాయ పురోగతికి అడ్డు తగిలే క్లిష్టమైన సమస్యలను ప్రస్తావించారు గేదెల శ్రీనుబాబు. వ్యవసాయంతో పాటు ఆహార ఆధారిత పరిశ్రమల ద్వారా లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఆర్థిక స్థితిగతులను పునర్నిర్మించడం, స్థిరమైన భవిష్యత్తును నిర్ధారించడంపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. వాణిజ్య పంటల సాగులో స్థానిక రైతులకు, వారి పిల్లలకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా దేశవ్యాప్తంగా ఉత్పత్తులను విక్రయించడానికి వారి పిల్లలకు కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), డిజిటల్ మార్కెటింగ్‌లో శిక్షణ అవసరమని చెప్పారు. యూరోపియన్ వ్యవసాయ సాంకేతికతలను అవలంభించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ పండించిన వస్తువులను ఎగుమతి చేసే లక్ష్యంతో యూరోపియన్ బిజినెస్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు వివరించారు.
ఈ ప్రయత్నంలో భాగంగా స్థానికంగా ఉండే విశ్వవిద్యాలయాన్ని, ఒక పరిశోధనా సంస్థను, సాంకేతికత బదిలీ కేంద్రంతో పల్సస్ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుని పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రయోగం ఆంధ్రప్రదేశ్ రైతులకు అనేక అవకాశాలను అందజేస్తుంది అని చెప్పారు. తద్వారా వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడానికి ఉపయోగ పడుతుంది అన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) డ్రోన్ సాంకేతికతతో పాటు అధునాతన వ్యవసాయ పద్ధతులను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. జీపీఎస్-ఆధారిత ఫీల్డ్ మ్యాపింగ్, రిమోట్ సెన్సింగ్ సహా పంట దిగుబడిని ఆప్టిమైజ్ చేయడానికి యూరోపియన్ వ్యవసాయ పద్ధతులపై మన రైతులకు శిక్షణ ఇచ్చి ముందుకు సాగాలన్నారు. 50,000 మంది రైతులు వారి పిల్లలు శ్రీకాకుళం, రాజాంలో జరిగిన ఈ ఈవెంట్‌లలో చురుకుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి, ఐక్యంగా ముందుకు సాగటానికి ఎంతగానో తోర్పడుతుందని తెలిపారు. అలాగే ఉత్తరాంధ్రకు మంచి భవిష్యత్తును అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




