AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Offers: ఫోన్లో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే చాలు ప్రత్యేక ఆఫర్లు.. పోలీసుల విన్నూత్న ప్రచారం

ఏలూరులో ఓ వినూత్న ప్రచారానికి పోలీసులు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు పండగలకి, పెళ్లిళ్లకి అంతేకాక ఆషాఢమాసంలో ప్రత్యేక ఆఫర్స్ అంటూ షాపింగ్ మాల్స్ తెగ ప్రచారం ఇచ్చేస్తుంటాయి. కానీ అలాంటి డిస్కౌంట్ ఆఫర్లు ఈ ఒక్కరోజు మాత్రమే ఏలూరులోని ప్రముఖ షాపింగ్ మాల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. పోలీసులే దగ్గరుండి మరి ఈ ఆఫర్లు ఇప్పిస్తున్నారు.

Special Offers: ఫోన్లో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే చాలు ప్రత్యేక ఆఫర్లు.. పోలీసుల విన్నూత్న ప్రచారం
Special Offers In Shopping Malls If Disha Yap Is Installed In Eeluru, Andhra Pradesh
B Ravi Kumar
| Edited By: |

Updated on: Nov 15, 2023 | 10:47 AM

Share

ఏలూరులో ఓ వినూత్న ప్రచారానికి పోలీసులు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు పండగలకి, పెళ్లిళ్లకి అంతేకాక ఆషాఢమాసంలో ప్రత్యేక ఆఫర్స్ అంటూ షాపింగ్ మాల్స్ తెగ ప్రచారం ఇచ్చేస్తుంటాయి. కానీ అలాంటి డిస్కౌంట్ ఆఫర్లు ఈ ఒక్కరోజు మాత్రమే ఏలూరులోని ప్రముఖ షాపింగ్ మాల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. పోలీసులే దగ్గరుండి మరి ఈ ఆఫర్లు ఇప్పిస్తున్నారు. ఇంతకీ పోలీసులు ఎందుకు షాపింగ్ మాల్స్‌లో ఆఫర్లు ఇప్పిస్తున్నారనే విషయం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు ఎంతో ప్రతిష్టాత్మకంగా దిశా చట్టాన్ని తీసుకువచ్చింది. ఆక్రమంలోనే మహిళలకు అందుబాటులో ఉండే విధంగా దిశా యాప్‌ను రూపొందించారు. దిశా యాప్ ద్వారా మహిళలు తమకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన సమయంలో యాప్‌ను ఉపయోగిస్తే నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వారి దగ్గరకు చేరుకుని వారినీ రక్షించే విధంగా యాప్ రూపొందించబడింది. ఇప్పటికే ఎంతో మంది దిశా యాప్‌ను ఉపయోగించి పోలీసుల ద్వారా రక్షింపబడ్డారు. అయితే అటువంటి యాప్ ఆండ్రాయిడ్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు దిశా యాప్ పై పూర్తిస్థాయిలో అవగాహన కలిగించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఎందుకంటే మహిళలు ఎక్కువగా షాపింగ్ మీద ఆసక్తి చూపుతారు. వస్త్రాలను ఎక్కువగా ఇష్ట ఇష్టపడి కొనుగోలు చేస్తారు కనుక వారికి దిశ యాప్‌తో పాటు.. కొన్న వస్త్రాలకు డిస్కౌంట్ ఆఫర్లు ఇవ్వాలని తద్వారా మరింత మందికి ఈ యాప్ పై అవగాహన కలుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. అందుకు మహిళలు ఎంతో ఇష్టపడే షాపింగ్ మాల్స్‌లోనే డిస్కౌంట్ సెంటర్లుగా మార్చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఏలూరులోని ప్రముఖ షాపింగ్ మాల్స్‌లో ఈ డిస్కౌంట్ ఆఫర్లను అనౌన్స్ చేశారు. వీటిని పొందడానికి మీరు చేయవలసిందిగా దిశా యాప్ మీ ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడమే. షాపింగ్‌మాల్లో ఏదైనా కొనుగోలు చేసిన తర్వాత మహిళలు తమ ఆండ్రాయిడ్ ఫోన్లో దిశా యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి.. కొనుగోలు చేసిన బిల్లులో 5 నుండి 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ యాప్ డౌన్లోడ్ కార్యక్రమంలో పోలీసులే షాపింగ్ మాల్స్ వద్ద దగ్గరుండి నిర్వహించడం గమనార్హం. అవకాశం ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. తద్వారా దిశా యాప్‌ను ప్రతి ఒక్క మహిళకు అందుబాటులో ఉంచి, వారికి ఎప్పుడైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే.. ఆ సమయంలో రక్షణ పొందే విధంగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..