AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadapa: డబ్బు ముందు చిన్నబోయిన పేగుబంధం.. ఫించన్ డబ్బులు తీసుకుని తల్లిని రోడ్డుమీద వదిలేసిన తనయుడు

Kadapa News: కడుపున పుట్టిన పిల్లలైనా, కన్న తల్లైనా .. బంధాలు అనుబంధాలు అన్నీ వ్యాపార బంధాలుగా మారాయి.  రోజు రోజుకీ మానవ సంబంధాలు మరింతగా దిగజారుతున్నాయి. నవమాసాలు మోసి కని..

Kadapa: డబ్బు ముందు చిన్నబోయిన పేగుబంధం.. ఫించన్ డబ్బులు తీసుకుని తల్లిని రోడ్డుమీద వదిలేసిన తనయుడు
Humanity Kadapa News
Surya Kala
|

Updated on: May 03, 2022 | 2:01 PM

Share

Kadapa News: కడుపున పుట్టిన పిల్లలైనా, కన్న తల్లైనా .. బంధాలు అనుబంధాలు అన్నీ వ్యాపార బంధాలుగా మారాయి.  రోజు రోజుకీ మానవ సంబంధాలు మరింతగా దిగజారుతున్నాయి. నవమాసాలు మోసి కని.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచిన తల్లి కన్న బిడ్డలకు భారమైపోతోంది. వృద్ధ్యాప్యంలో అండగా ఆసరాగా నిలబడాల్సిన తల్లిని నడిరోడ్డుమీద వదిలేసిన ప్రబుద్ధులు అనేకమంది ఉన్నారు. ఇటువంటి దారుణ ఘటన  కడప జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని వేంపల్లెలో తల్లి భారమైందని నడి రోడ్డుమీద  నిర్ధాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయాడు తనయుడు. చక్రాయపేట మండలం అగ్రహారానికి చెందిన అనుమక్క అనే వృద్ధురాలు వాలంటీరు ద్వారా తన వృద్ధాప్య పింఛను అందుకుంది. తల్లికి వచ్చిన ఫించన్ ను కొడుకు తీసుకుని.. వెంటనే ఆటోలో వేంపల్లెకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ మెయిన్ రోడ్డుమీద వదిలేసి వెళ్ళిపోయాడు. దీంతో ఆ వృద్ధురాలు అలా నడిరోడ్డుమీద ఒకరోజు అంతా ఉండిపోయింది.  ఒకరోజు అనంతరం స్థానికులు స్పందించి ఆ వృద్ధురాలిని మదర్ థెరిసా అనాథ వృద్ధుల ఆస్పత్రిలో తీసుకుని వెళ్ళి జాయిన్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read:

Telangana: గుడ్ న్యూస్.. తెలంగాణాలోని అన్ని ఆసుపత్రిలో త్వరలో ఆ వైద్య సేవలు..

Travel Special: మీరు పక్షి ప్రేమికులా.. ఓఖ్లా పక్షుల అభయారణ్యం బెస్ట్ ఎంపిక.. ఇక్కడ ఎన్ని రకాల పక్షులున్నాయో తెలుసా..

ముఖానికి మెరుపునిచ్చే సహజమైన ఫ్రూట్ ఫేస్ ప్యాక్‌..(Web story)