Konaseema: ప్రేమించి ఓ పాపకు తల్లిని చేసి తప్పించుకుని తిరుగుతున్న ప్రబుద్ధుడు.. జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించిన యువతి
Konaseema District: ప్రేమ అంటే.. నేడు ప్రేమించడం.. మరచిపోవడం అన్న చందంగా మారిపోయింది. రోజు రోజుకీ తాము ప్రేమ పేరుతో మోసపోయారంటూ యువత పోలీస్ స్టేషన్ (Police Station) గడప..

Konaseema District: ప్రేమ అంటే.. నేడు ప్రేమించడం.. మరచిపోవడం అన్న చందంగా మారిపోయింది. రోజు రోజుకీ తాము ప్రేమ పేరుతో మోసపోయారంటూ యువత పోలీస్ స్టేషన్ (Police Station) గడప ఎక్కుతున్నారు. లేదా అధికారులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా నా భర్తపై చర్య తీసుకోండి కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. ఈ ఘటన కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి బిడ్డ పుట్టిన అనంతరం ప్రియుడు వదిలేశాడు. ఉప్పులగుప్తం మండలం వాసాలతి కు చెందిన వాతాడ వెంకటలక్ష్మి ని.. మామిడికుదురు మండలం గోగన్నమఠానికి చెందిన పెస్సింగి నరసింహస్వామి ప్రేమించానని చెప్పాడు. పెళ్లి చేసుకుందంటూ.. మాయ మాటలుచెప్పి గర్భవతిని చేశాడు. పాప పుట్టిన తర్వాత తనకు ఆ పాప జన్మకు సంబంధం లేదని దాటవేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను న్యాయం చేయమని కోరుతూ.. పోలీసులను ఆశ్రయించింది. డీఎన్ఏ పరీక్ష నిర్వహించామని కోరింది. అయితే డీఎన్ఏ పరీక్ష చేయించినప్పటికీ.. నివేదిక బహిర్గతం చేయలేదంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసిందని. తనకు న్యాయం చేయమని కోరుతూ.. స్పందనలో కోనసీమ జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసింది. తన పాపకు తండ్రి తనకు భర్త అయిన నరసింహంను తీసుకురావాలని కన్నీరు మున్నీరుగా వినిలపిస్తోంది. తనకు ఇప్పటికైనా న్యాయం చేయమని అధికారులను కోరుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Read:
Telangana: గుడ్ న్యూస్.. తెలంగాణాలోని అన్ని ఆసుపత్రిలో త్వరలో ఆ వైద్య సేవలు..
